Family Disputes | కుటుంబంలో నిత్యం గొడవలా..? బావి నీటితో చెక్ పెట్టండిలా..!
Family Disputes | కుటుంబం( Family ) ఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు( Fight ) ఏర్పడుతుంటాయి. కొన్ని కుటుంబాల్లో అయితే నిత్యం గొడవలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

Family Disputes | కుటుంబం( Family ) ఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు( Fight ) ఏర్పడుతుంటాయి. కొన్ని కుటుంబాల్లో అయితే నిత్యం గొడవలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ గొడవలకు ప్రధాన కారణం.. డబ్బు( Money ) సంపాదన, ఆస్తి వివాదాలు( Property Disputes ) ఉంటాయి. డబ్బు, ఆస్తి వివాదాల వల్ల ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. అదృష్టం వరించదు. నిత్యం కష్టాలు అనుభవిస్తూ.. దురదృష్టాన్ని వెంటేసుకుని తిరుగుతుంటారు. మరి అలాంటి కుటుంబంలో గొడవలు సమసిపోయి.. అదృష్టం, ఐశ్వర్యం కలగాలంటే.. కొన్ని పరిహారాలు చేయాల్సిందేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉంటారని పేర్కొంటున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో చూద్దాం.
దీపారాధన
తన కుటుంబం బాగుండాలి.. ఎలాంటి గొడవలు జరగకూడదనే ఆలోచనతో ఆ ఇంటి ఇల్లాలు నిత్యం దేవుళ్లను పూజిస్తుంటారు. అయితే దేవుళ్లను పూజించడం ఒకే. కానీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి రావాలంటే.. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు. అది కూడా నువ్వుల నూనె లేదా అవిసె నూనెతో జిల్లేడు వత్తులు ఉపయోగించి దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు.
గోధుమ పిండి
గోధుమ పిండి ప్రతి ఇంట్లో ఉంటుంది. వీటితో చపాతీలను చేసుకుని ఆరగిస్తుంటారు. అయితే గోధుమ పిండి పట్టించే క్రమంలో.. అందులో ఓ నాలుగు శనగ గింజలు వేయాలి. ఇక గోధుమ, శనగలతో కూడిన పిండితో చపాతీలు చేసుకుని తినడం వల్ల.. రవి గురువుల బలం వల్ల అదృష్టం కలిసి వస్తుందని పండితులు సూచిస్తున్నారు.
బావి నీటితో స్నానం
చాలా కుటుంబాల్లో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటుంటారు. కుటుంబ కలహాలు ఉంటే లక్ష్మీ దేవి దూరమవుతుందని, దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి కుటుంబ కలహాలు రాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే వీలైనప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒకేసారి బావినీళ్లతో స్నానం చేయాలని సూచిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత గోమాతకు 5 రకాల పప్పు ధాన్యాలు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు క్రమక్రమంగా తగ్గి అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు.
పక్షులకు ఆహారం
కుటుంబ సభ్యులందరికీ అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలన్నా, అందరూ క్షేమంగా ఉండాలన్నా భోజనం చేసే సమయంలో పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టాలని చెబుతున్నారు.