Sri Rama Navami 2025 | శ్రీరామనవమి రోజున ‘సపోటా’ నైవేద్యంగా పెడితే.. పెళ్లి కావడం ఖాయం..!
Sri Rama Navami 2025 | పెళ్లి( Marriage ) కోసం ఎదురుచూస్తున్న వారు, ఇతర ఇబ్బందులతో బాధపడేవారు.. శ్రీరామనవమి( Sri Rama Navami 2025 ) రోజున ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తే.. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Sri Rama Navami 2025 | శ్రీరామనవమి(Sri Rama Navami 2025) రేపే. ఇక సీతారాముల కల్యాణ( Sitaramula Kalyanam ) వేడుకకు సర్వం సిద్ధమైంది. ఊరు వాడ పల్లె పట్ణణం అనే తేడా లేకుండా దేశంలోని అన్ని రామాలయాలూ( Ramalayam ) సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇక రేపు సీతారాముల కల్యాణాన్ని తిలకించడమే ఆలస్యం.
శ్రీరామనవమి నేపథ్యంలో రామ భక్తులు రకరకాల నైవేద్యాలు తయారు చేస్తుంటారు. శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు వంటి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే.. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారు, ఇతర ఇబ్బందులతో బాధపడేవారు.. శ్రీరామనవమి రోజున ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తే.. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ ఇతర నైవేద్యాలో ఏంటో తెలుసుకుందాం.
వీటిని నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితాలు..
జామ పండు
సంసారం అన్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ కొన్ని గొడవలు దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి దంపతులు శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి జామ పండును నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, సఖ్యత పెరుగుతుందని అంటున్నారు.
కొబ్బరి ముక్కలు
ఇక ఉద్యోగం చేసే ప్రాంతంలో తరుచుగా అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మానసికంగా హింసిస్తుంటారు. ఇలాంటి వారు కొబ్బరిముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
సపోటా
పెళ్లి వయసు వచ్చాక కూడా చాలా మందికి వివాహం కుదరదు. అబ్బాయికి అమ్మాయి నచ్చకనో.. అమ్మాయికి అబ్బాయి నచ్చకనో, కట్నకానుకల విషయాల్లోనూ.. ఏదో రకంగా పెళ్లిళ్లు కుదరని వారు.. నవమి రోజు రామయ్యకు సపోటా పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలని చెబుతున్నారు. ఇలా చేస్తే పెళ్లి తప్పకుండా అవుతుందని పండితులు చెబుతున్నారు.
కమలాపండు
జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను చేరేందుకు అన్ని రకాలుగా శ్రమిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు సంభవిస్తుంటాయి. ఇలా లక్ష్యాలను చేరుకోలేని వారు. కమలాపండు ముక్కలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు.
పనస పండు
దీర్ఘకాలిక రోగాలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వారు.. పనస పండు ముక్కలను శ్రీరాముడికి ప్రసాదంగా సమర్పించాలని చెబుతున్నారు.