Guava | జామపండు తొక్కతో తినాలా.. లేక తొక్క లేకుండా తినాలా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
సీజన్ ఏదైనా సరే జామపండు (Guava) మార్కెట్‌లో దొరుకుతుంది. వేరే పండ్లతో పోలిస్తే ధర కూడా చాలా తక్కువ. వీటిని జ్యూస్‌లుగా, జామ్‌లుగా, స్మూతీలతో లేదా పచ్చిగా కూడా తినొచ్చు. కొందరు జామకాయతో పచ్చడి కూడా చేసుకుంటుంటారు. ఇందులో పోషకాలు నిండుగా ఉంటాయి.
Guava | సీజన్ ఏదైనా సరే జామపండు (Guava) మార్కెట్‌లో దొరుకుతుంది. వేరే పండ్లతో పోలిస్తే ధర కూడా చాలా తక్కువ. వీటిని జ్యూస్‌లుగా, జామ్‌లుగా, స్మూతీలతో లేదా పచ్చిగా కూడా తినొచ్చు. కొందరు జామకాయతో పచ్చడి కూడా చేసుకుంటుంటారు. ఇందులో పోషకాలు నిండుగా ఉంటాయి. దీన్ని రోగనిరోధక శక్తిని పెంచే, జీర్ణక్రియకు సహాయపడే సూపర్‌ఫ్రూట్‌గా అభివర్ణిస్తారు.
అయితే, కొందరు దీని తొక్కతీసి (guava peel) తింటారు. అలా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తొక్క తీసి తినడం వల్ల చాలా పోషకాలు కోల్పోతామంట. తొక్కతోపాటూ ఈ పండ్లను తినడం వల్ల
పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి అదనపు సూక్ష్మపోషకాలు లభిస్తాయి. ఇది చర్మం ఆకృతిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. కానీ, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఉన్నవారు తొక్కను తీసి తినడమే ఉత్తమం.
సూపర్‌ఫ్రూట్ లాభాలు..
జామలో విటమిన్ ఎ, సి, బి2, ఇ, కె, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ జామపండు తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతారు. జామతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా సొంతమవుతుంది. సాధారణంగా విటమిన్ సి కోసం కమలా పండు తినమంటారు. కానీ దాంతో పోలిస్తే జామ పండులోనే 4 రెట్లు అధికంగా విటమిన్ సి దొరుకుతుంది.
మలబద్దక సమస్య ఉన్న వారికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి. జామకాయల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్య లక్షణాలు కూడా నెమ్మదిస్తాయట. వీటిలో ఉండే పీచు కారణంగా కొలెస్ట్రాల్, బీపీ అదుపులోకి వస్తాయి. బరువు తగ్గాలనుకున్న వారు జామను తమ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని
కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. జామ పండే కాదు ఆ చెట్టు ఆకులు కూడా ఔషధంలా పనిచేస్తాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామ ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే త్వరగా తగ్గుతుంది. ఆ నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి ఉదయం పరగడుపున తాగాలి. కుదరకపోతే రోజులో ఏ సమయంలో అయినా తాగవచ్చు. ఇలా జామ ఆకులతో నీళ్లను తయారు చేసి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి కూడా జామకాయలు, ఆకులు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Bharat Taxi | త్వరలో భారత్ ట్యాక్సీ రయ్‌రయ్.. ఈ సేవల గురించి తెలుసా..?
Beggar | షాకింగ్.. బిచ్చగాడి వద్ద రూ.4 లక్షల నగదు.. రద్దు చేసిన, విదేశీ కరెన్సీ లభ్యం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram