Vastu Tips | బొప్పాయి చెట్టుతో బోలేడు కష్టాలు..! జాగ్రత్త సుమా..!!
Vastu Tips | ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు( Plants ) నాటుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో ప్రధానంగా పూలు( Flowers ), పండ్ల( Fruits ) మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ఆకర్షణీయమైన మొక్కలపై ఆసక్తి చూపిస్తారు. అయితే బొప్పాయి మొక్క( Papaya Tree )ను ఇంటి ఆవరణలో నాటడం వల్ల.. ఆ ఇంటిని బోలెడు కష్టాలు వెంటాడుతాయట.
Vastu Tips | ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇందుకోసం తమ ఇంటి ఆవరణలో చల్లని గాలిని ఇచ్చే మొక్కలను( Plants ) పెంచుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో పండ్లు( Fruits ), పూల( Flowers ) మొక్కలను నాటుతుంటారు. వీటితో పాటు ఆకర్షణీయమైన మొక్కలను కూడా నాటి.. ఆ ఇంటికి కొత్త అందాన్ని తీసుకొచ్చేందుకు యత్నిస్తుంటారు. అయితే పండ్లు, పూల మొక్కలు నాటేందుకు వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించాలని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేని యెడల ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు( Financial Problems ) మొదలవుతాయని, బోలెడు అప్పులు చేయాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పండ్ల మొక్కల్లో ఒకటి బొప్పాయి( Papaya Tree ).
చాలా మంది తమ ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటేస్తుంటాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పొరపాటున పెరిగినా కూడా దాన్ని వెంటనే పీకి మరో చోట నాటాలని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే.. ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, సుఖసంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదని చెబుతుంటారు.
వాస్తు ప్రకారం.. ఇంటి ముందు బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి ముందు, ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు, కష్టాలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని చెబుతున్నారు.
వాస్తు ప్రకారం.. ఇంటి వెనక వైపు నాటుకోవడం మంచిదంట. దీని వలన ఎలాంటి ఆర్థిక సమస్యలు రావంట. వాస్తు ప్రకారం కూడా బొప్పాయి మొక్కను ఇంటి వెనక భాగంలో పెంచుకోవడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram