Vastu Tips | ఈ దిశలో తలపెట్టి నిద్రిస్తే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారట..!
Vastu Tips | మీరు ఆర్థిక ఇబ్బందులతో( Financial Problems ) సతమతమవుతున్నారా..? కోటీశ్వరులు( millionaire ) కావాలన్నా కోరిక కలగానే మిగిలిపోతుందా..? అయితే పొరపాటు మీ దగ్గరే ఉంది. అదేలాగా అంటే.. మీరు కుబేర దిశలో నిద్రించడం( Sleep ) లేదని. ఈ దిశలో తలపెట్టి నిద్రిస్తే.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తడం ఖాయమట.
Vastu Tips | నిద్రకు( Sleep ) కూడా వాస్తు నియమాలు( Vastu Tips ) ఉన్నాయి. మరి అడ్డదిడ్డంగా, ఎక్కడ పడితే అక్కడ నిద్రిస్తే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాస్తు నియమాలను అనుసరించి నిద్రిస్తే మంచి జరుగుతుందని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు. నలు దిక్కులా.. ఏ దిక్కులో తల పెట్టి నిద్రిస్తే.. ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..
తూర్పు వైపు ( East )
తూర్పు దిశను హిందువులు శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిశ కాబట్టి. అంతేకాకుండా ఇంటి ముఖద్వారం కూడా తూర్పు దిశ వైపే ఉండాలని కోరుకుంటారు. అది మంచిది కూడా. అయితే తూర్పు దిశ వైపు తలపెట్టి నిద్రించడం వల్ల ఎంతో శుభమని అంటున్నారు వాస్తు పండితులు. తూర్పు దిశ తాత్విక ఆలోచన, నమ్మకాలు, అభ్యాసాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
పడమర వైపు ( West )
పడమర దిశ కూడా నిద్రకు మంచిదే. సూర్యుడు అస్తమించే దిశ కూడా. ఈ దిశ తూర్పు పాలకుడు ఇంద్రునితో ముడిపడి ఉంటుంది. ఈ స్థానం ఉదయించే సూర్యుని వైపు నమస్కారాలు చేయడానికి, దైవిక శక్తుల ప్రశంసలను సూచించడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఉత్తరం వైపు ( N0rth )
ఉత్తరం వైపు తల పెట్టి దక్షిణం వైపుకు తిరిగి పడుకోవద్దని గట్టిగా సలహా ఇస్తారు. దీనికి కారణం దక్షిణం పాలకుడు యముడు (మృత్యుదేవత) ఈ దిశతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ దిశ నిద్ర వల్ల పీడకలలు, చెదిరిన నిద్ర, ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు. కాబట్టి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకపోవడం ఉత్తమం.
దక్షిణం వైపు ( South )
నిద్రించేందుకు తూర్పు దిశ తర్వాత దక్షిణ దిశ చాలా అనువైనది అని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని భూమి అయస్కాంత క్షేత్రంతో సమలేఖనం చేస్తుందని, ప్రశాంతమైన నిద్రను, శ్రేయస్సును, సంపదను ప్రోత్సహిస్తుందని భావిస్తారు. ఈ దిశ ఎదురుగా ఉత్తర పాలకుడు కుబేరుడు ఉంటాడు. కాబట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చు( millionaire )అని వాస్తు పండితులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram