ఈ గణనాథుడి ఆలయాన్ని సందర్శిస్తే పెళ్లి కావడం ఖాయం..!
ఈ గణనాథుడి ఆలయాన్ని సందర్శిస్తే వివాహం జరగడం ఖాయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ వినాయకుడికి పెళ్లిళ్లు ఖాయం చేసే గణనాథుడు అని పేరుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఆలయం గురించి తెలుసుకోండి..
వయసొచ్చిన ప్రతి అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేయాలని తమ తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. చాలా మందికి తొందరగానే పెళ్లిళ్లు అవుతాయి. కానీ కొందరికి ఎన్ని సంబంధాలు చూసినా వర్కవుట్ కావు. ఏదో ఒక కారణం చేత పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతుంటాయి. ఇలాంటి వారు ఈ గణనాథుడి ఆలయాన్ని సందర్శిస్తే వివాహం జరగడం ఖాయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ వినాయకుడికి పెళ్లిళ్లు ఖాయం చేసే గణనాథుడు అని పేరుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఆలయం గురించి తెలుసుకోండి..
ఈ విఘ్నేశ్వరుడి ఆలయం ఉత్తర కర్ణాటక జిల్లాలో ఉంది. ఉత్తర కర్ణాటక జిల్లాలోని ఇందగుంజి పట్టణంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి ఏడాది పది లక్షల మంది వస్తుంటారు. ఈ ఆలయాన్ని స్థానికంగా ఇదగుంజి మహా గణపతి ఆలయం అని పిలుస్తారు. ఆలయాన్ని సందర్శించే వారిలో పెళ్లి కాని వారే అధికంగా ఉంటారు. తమకు త్వరగా పెళ్లి కావాలని మొక్కుకుంటారు. తమ కోరిక నెరవేరినట్లైతే తక్షణమే.. మళ్లీ ఆలయానికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు అని ఆలయ పండితులు చెబుతున్నారు.
సాధారణంగా ఏ ఆలయంలోనైనా వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. అయితే ఈ దేవాలయంలో మాత్రం విఘ్నేశ్వరుడు రెండు చేతులతోనే దర్శనం ఇస్తాడు. నిలుచున్న ఆకారంలో కనిపిస్తాడు. అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఈ దేవాలయాన్ని 1500 సంవత్సరాల క్రితం నిర్మించారని చరిత్రలో ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే వివాహం కుదిరిన వెంటనే ఇక్కడ వినాయక స్వామి చెంత రెండు చీటీలను ఉంచుతారు. కుడి పాదం దగ్గర ఉన్న చిటి కింద పడితే దేవుని అంగీకారం ఉందని, ఎడమ పాదం దగ్గర ఉన్న చిటి కింద పడితే దేవుని అంగీకారం లేదని స్థానిక ప్రజలు, పూజారులు చెబుతున్నారు. దేవుని అనుగ్రహం లేదని భావించిన వాళ్ళు మరో సంబంధం వెతుక్కుంటారని కూడా చెబుతున్నారు. అలాగే ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా ఈ దేవాలయంలో ఇస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయన్ని జీవితంలో ఒక్కసారి అయినా దర్శిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram