Karthika Masam | కార్తీక మాసంలో ధ‌న‌దీపం వెలిగిస్తే.. అష్టైశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ట‌..!

Karthika Masam | పరమపవిత్రమైన కార్తీక మాసం( Karthika Masam )లో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అందులో భాగంగా ఈ మాసంలో ఏ రోజు అయినా సరే ధనదీపం( Dhana Deepam ) పేరుతో ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే మీ గృహంలో లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఆనందతాండవం చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ధన దీపాన్నే "లక్ష్మీదీపం"( Lakshmi Deepam ) అనే పేరుతో కూడా పిలుస్తార‌ట‌.

Karthika Masam | కార్తీక మాసంలో ధ‌న‌దీపం వెలిగిస్తే.. అష్టైశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ట‌..!

Karthika Masam | కార్తీక మాసం( Karthika Masam ) నేప‌థ్యంలో శివాల‌యాల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడ‌తున్నాయి. కార్తీక దీపాల‌తో ఆల‌యాల‌న్నీ వెలిగిపోతున్నాయి. ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక, మోక్ష సాధ‌న‌కు ఎంతో విశిష్ఠ‌మైన‌ది. ఈ మాసంలో న‌దీస్నానం, దానం, జ‌పం, ఉప‌వాసం, దీపారాధ‌న‌, దీప‌దానం వంటి వాటికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంటారు. అయితే కార్తీక మాసంలో ధ‌న‌దీపం( Dhana Deepam ) పేరుతో ఒక ప్ర‌త్యేక‌మైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్ర‌హంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోయి.. అష్టైశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఈ ధ‌న‌దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి..? ఎలా వెలిగించాలి..? అనే విషయాల‌ను తెలుసుకుందాం..

ధ‌న‌దీపాన్ని ఎలా వెలిగించాలంటే..?

  • ధ‌న‌దీపం వెలిగించాల‌నుకున్న రోజు.. వేకువ‌జామునే నిద్ర నుంచి మేల్కొనాలి. ఇంటితో పాటు పూజ‌గ‌దిని శుభ్రం చేసుకోవాలి.
    త‌ర్వాత శ్రీ మ‌హాల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టాన్ని గంధం, కుంకుమ బొట్ల‌తో అలంక‌రించాలి. పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీట‌కు ముందు భాగంలో మూడు చోట్ల ప‌సుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఇక పీట మీద రాగి లేదా ఇత్త‌డి ప‌ళ్లెంను ఉంచి ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆపై ఆ పళ్లెంలో గుప్పెడు బియ్యం పోసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వును ఉంచాలి. బియ్యంలో రూపాయి బిళ్ల కూడా వేయాలి.
  • ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి.
  • ఇప్పుడు రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో మూడు చొప్పున యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్లు ఉప్పు వేసుకోవాలి.
  • ఆ తర్వాత రెండో మట్టి ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకోవాలి. అనంతరం అందులో రెండు లేదా మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి. అనంతరం దాన్ని ఏక హారతి లేదా ఆగరుబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే “ధనదీపం లేదా లక్ష్మీదీపం” పేరుతో పిలుస్తారు.
  • ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్లెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వునూ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి.
  • బియ్యంలో ఉన్న రూపాయి కాయిన్ తీసుకొని దాన్ని ఒక పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలి. అనంతరం ఆ పళ్లెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి.. లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించాలి.
  • ఇలా ఎవరైతే కార్తీకమాసంలో ఏ రోజు అయినా, మరీ ముఖ్యంగా గురు లేదా శుక్రవారం నాడు ఈ శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.