Jagannath Rath Yatra | మరికొద్దిసేపట్లో పూరీ జగన్నాథుడి రథయాత్ర.. గుండిచా యాత్ర గురించి ఎవరికీ తెలియని విశేషాలు..!

Jagannath Rath Yatra | ఆషాఢమాసం అనగానే అందరికీ పూరీ జగన్నాథుడి రథయాత్ర గుర్తుకు వస్తుంది. ఆషాఢమాసంలోని రెండోరోజు రథయాత్ర మొదలవుతుంది. ఈ రథయాత్రకు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవు. అవేంటో ఒకసారి చూసేద్దాం రండి..!

Jagannath Rath Yatra | మరికొద్దిసేపట్లో పూరీ జగన్నాథుడి రథయాత్ర.. గుండిచా యాత్ర గురించి ఎవరికీ తెలియని విశేషాలు..!

Jagannath Rath Yatra | ఆషాఢమాసం అనగానే అందరికీ పూరీ జగన్నాథుడి రథయాత్ర గుర్తుకు వస్తుంది. ఆషాఢమాసంలోని రెండోరోజు రథయాత్ర మొదలవుతుంది. ఈ రథయాత్రకు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవు. అవేంటో ఒకసారి చూసేద్దాం రండి..!

యాత్ర ఎప్పుడు మొదలైంది..?

జగన్నాథ రథయాత్ర అత్యంత పురాతనమైంది. ఈ యాత్ర ఎప్పుడు మొదలైందో ఇప్పటి వరకు తెలియదు. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలోనూ ఈ జగన్నాథుడి రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ప్రపంచంలోని ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలను మాత్రమే రథోత్సవంలో ఉపయోగిస్తారు. కానీ, పూరీలో మాత్రం అలా జరుగదు. గుర్భగుడి నుంచే దేవతామూర్తులు బయటకు రావడం విశేషం. ఆ సమయంలో దేవతా విగ్రహాలను ఏమతం వారైనా చూడవచ్చు.

జగన్నాథుడి రథం పేరు ఏంటంటే..?

ఈ జగన్నాథుడి రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారుచేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ రథాల తయారీని అక్షయతృతీయ రోజున ప్రారంభిస్తారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజమని పిలుస్తారు. బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజమని, సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఈ రథాలని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి. దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ? ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలిలాంటి లెక్కల్ని తూ.చా. తప్పకుండా పాటించాల్సిందే. రథాన్ని తయారుచేసేందుకు ఎన్ని చెక్కముక్కలు వాడాలో సైతం లెక్క ఉండాల్సిందే.

మహారాజే వచ్చి..

ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నా.. కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు, జగన్నాథుడి రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందు బంగారు చీపురతో ఊడుస్తారు. ఈ ఆచారం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ, జగన్నాథ రథయాత్ర అలా జరుగదు. జగన్నాథుడికి గుండిచా మౌసిమా (చిన్నమ్మ) ఉంటారు. ఆమె కొలువుదీరి ఉండే గుడి పూరీ ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తొమ్మిదిరోజుల పాటు అక్కడే..

జగన్నాథుడు తొమ్మిదిరోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ ఆలయానికి చేరుకుంటారు. మన దగ్గర రాములవారి కల్యాణం రోజున తప్పకుండా వర్షంపడుతుందనే నమ్మకం ఉన్నది. అయితే, జగన్నాథ రథయాత్రలో సైతం ప్రతీసారి వర్షం పడడం కూడా ఓ ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదేమో.. అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం జరగదు. కొన్ని గంటలపాటు కొన్ని వేలమంది కలిసి లాగితే కానీ రథం కదలడం జరగదు.

బంగారు ఆభరణాలతో అలంకరణ..

జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని ‘బహుద యాత్ర’ అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ ‘మౌసీ మా’ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతారు. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం నిర్వహిస్తారు. విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఇందు కోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను సైతం ఉపయోగిస్తారు.