పాండవులలో చిన్నవాడు సహదేవుడి గురించి తెలుసా?
మహాభారత ఇతిహాసములొ పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి మాద్రి అశ్వనీదేవతలచే నకుల సహదేవులను కన్నది

మహాభారత ఇతిహాసములొ పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి మాద్రి అశ్వనీదేవతలచే నకుల సహదేవులను కన్నది.
పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం ఉపపాండవులలో శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన “విజయ”ను కూడాస్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు.
ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాససమయంలో సహదేవుడు “తంత్రీపాలుడు” అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధములో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.
యుధిష్ఠిరుడు రాజయినాక దక్షిణదేశ దండయాత్రకు సహదేవుని పంపాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు.
అశ్వనిదేవతల అంశతో జన్మించిన సహదేవుడికి భూతభవిష్యత్తులను దర్శించే వరం ఉంది. బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే చూడగలిగే సహదేవుడు, ఎవరైనా అడిగితేనే చెప్పగలడు. తనకు తానుగా ఎవరి భవిష్యత్తూ చెప్పలేడు. అంటే, మహాభారతయుద్ధమూ, తమ ఐదుగురు అన్నదమ్ముల జీవితమూ అన్నీ ముందే తెలుసు. కానీ చెప్పడు. ఈ విషయం శ్రీకృష్ణుడికి కూడా తెలుసు. చెపితే ఏమౌంతుందో అనే భయమూ, తన భద్రత ఇవన్నీ సహదేవుడి సందేహాలు. గొప్ప విజ్ఞానవంతుడైనా, దాన్ని పంచుకోలేనివాడు. అందుకే తెలివితేటలూ, గొప్ప జ్ఞానమూ ఉండి కూడా ఇతరులకు పంచలేకపోవడాన్ని ‘సహదేవ నీతి’ అంటారు.
1 .అత్యంత తెలివి కలవాడు. ధర్మరాజు కు సలహాదారు గా నియమింపబడ్డవాడు. సహదేవుడు కూడా ఆయుర్వేదం -పశు సంరక్షణ లో ప్రవీణుడు. తన సోదరుడు నకులుడు కన్నా మంచి జ్యోతిష్య వేత్త.
3 . నకులుడు మాదిరిగానే మంచి కత్తి యుద్ధనిపుణుడు.
4. దుర్యోధనుని కోరిక మేర యుద్ధ ముహూర్తం చెప్పిన వాడు.
ఐదుగురి పాండవ సోదరులలో చివరి ఇద్దరు కనుక తమ అగ్రజుల మాట ప్రకారం ఉండుట వలన అంత ప్రాముఖ్యత లేదని భావించడం కద్దు.రాజసూయ యాగంలో ఇద్దరూ నకుల సహదేవులు అనేక రాజ్యాలను జయించిన వీరులు.