Neem Tree Benefits | ‘శని’ మిమ్మల్ని వెంటాడుతుందా..? వేప చెట్టుతో ఉపశమనం పొందండిలా..!
Neem Tree Benefits | ప్రతి ఒక్కరి జీవితం( Life ) సానుకూలంగా ఉండదు. కొందరి జీవితాల్లో ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఎన్ని మంచి పనులు చేసినా శని( Shani ) వెంటాడుతూనే ఉంది. రాహు - కేతు( Rahu - Kethu ) గ్రహాలు కూడా ఆటంకం కలిగిస్తాయి. వీటి నుంచి వేప చెట్టు( Neem Tree )తో ఉపశమనం పొందొచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Neem Tree Benefits | జీవితం( Life )లో చాలాసార్లు మనం చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ సమస్యలను అధిగమించేందుకు ఆధ్యాత్మిక( Spiritual ) పరంగా, వాస్తు( Vastu ) పరంగా కొన్ని నియమాలు పాటించక తప్పదు. ఇక జీవితంలో ఆటంకాలకు కారణం మన జాతకంలోని శనీశ్వరుడు( Shanishwarudu ) లేదా రాహు-కేతువుల( Rahu – kethuvu ) అశుభ ప్రభావం కావచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పరిష్కారాలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నాయి. ఈ గ్రహాల వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు( Neem Tree ) సహాయపడుతుందని నమ్మకం. అయితే వేప చెట్టుని ఇంటి ఆవరణలో నాటే సమయంలో వాస్తు నియమాలున్నాయి. వేప చెట్టుని సరైన దిశలో నాటడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ చెట్టుని సరైన దిశలో పెంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి, ఇంటికి శ్రేయస్సు వస్తుంది. జీవితంలో శాంతి నెలకొంటుందని నమ్మకం.
అయితే హిందూ మతంలో వేప చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వేపచెట్టు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శనీశ్వరుడి వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు సహాయపడుతుందని నమ్ముతారు. ఇది రాహువు, కేతువు, శనిశ్వరుడి ప్రభావాలను తగ్గించడమే కాదు సానుకూలత, సంపదను కూడా తెస్తుంది. ఇంటి బయట వేప చెట్టును నాటడం వల్ల చెడు దృష్టి, పూర్వీకుల శాపం , శని-కుజుడు శాపం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వేప మొక్కను ఏ దిశలో నాటాలి?
జ్యోతిషశాస్త్రం ప్రకారం వేప కుజుడు, శని , కేతువు గ్రహాలకు సంబంధించినది. కాబట్టి వేప మొక్కను నాటడానికి దక్షిణ దిశ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో ఒక మొక్కను నాటడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం కలుగుతుంది.
వేప చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు
వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఉత్తర భారత దేశంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మల ను ఉపయోగిస్తారు. వేప చెక్కతో హవనము చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం. వేప ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి.
కుజ దోషాన్ని తొలగించే వేప చెట్టు
వేపకు అంగారక గ్రహానికి( కుజుడికి) సంబంధం ఉంది. ప్రతిరోజూ వేప చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా కుజ గ్రహ దుష్ప్రభావాలను శాంతింపజేసే హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. వేప మాల ధరించడం ద్వారా శనిశ్వరుడి అశుభ ప్రభావాలను కూడా నివారించవచ్చు. జాతకంలో కేతు దోషం ఉంటే నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram