తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు..రేపు బద్రీనాధ్

ఆరు నెలల విరామం తర్వాత కేదార్‌నాథ్‌ దేవాలయం మళ్లీ తెరుచుకుంది. కేదార్ నాథుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. మంచు తెరల మధ్య భక్తుల హరహర మహాదేవ్..జై బాబా కేదార్ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మారుమ్రోగుతుండగా.. ఉదయం 8 గంటలకు గుడి తలుపులు తెరుచుకోగా..కేదార్ నాథుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు..రేపు బద్రీనాధ్

విధాత : ఆరు నెలల విరామం తర్వాత కేదార్‌నాథ్‌ దేవాలయం మళ్లీ తెరుచుకుంది. కేదార్ నాథుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. మంచు తెరల మధ్య భక్తుల హరహర మహాదేవ్..జై బాబా కేదార్ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మారుమ్రోగుతుండగా.. ఉదయం 8 గంటలకు గుడి తలుపులు తెరుచుకోగా..కేదార్ నాథుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆలయాన్ని51క్వింటాళ్ల రంగురంగుల పూలతో అలంకరించారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో మహాశివుడి ధర్శనం కోసం వస్తున్న భక్తులతో మంచుకొండలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కేదార్‌నాథ్ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన భైరవనాథుడిని దర్శించుకుని కేదార్ నాథ్ ని దర్శించుకుంటున్నారు. శీతాకాలంలో ఆలయం మూసి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఆయనే రక్షిస్తారని భక్తుల నమ్మకం. అని స్థానిక పూజారి పేర్కొన్నారు. భైరవనాథుడిని దర్శించుకోకపోతే కేదార్‌నాథ్ యాత్ర అసంపూర్ణమని, ఆయన దర్శనం యాత్రను సురక్షితం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

కేదార్ నాథ్ ఆలయంలో మొదటి మూడు రోజులు కేవలం ప్రత్యేక అనుష్ఠానాలు, పూజలు మాత్రమే నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం, ఏప్రిల్ 25 నుంచి బాబా వారికి నిత్య భోగ నివేదన (నైవేద్యం), క్రమబద్ధమైన పూజలు ప్రారంభమవుతాయి. చార్‌ధామ్ యాత్ర కోసం 14.5 లక్షల మందికిపైగా భక్తులు నమోదు చేసుకున్నట్లు అంచనా.

రేపే బద్రీనాథ్ యాత్ర ప్రారంభం

కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోవడంతో చార్ ధామ్ యాత్రలో మరో ప్రధాన ఘట్టానికి రంగం సిద్దమైంది. రేపు గురువారం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 6:15 గంటలకు విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. భూలోక వైకుంఠంగా పిలిచే బద్రీనాథ్ దర్శనం కోసం కూడా ఇప్పటికే భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Chittibabu | టాలీవుడ్‌కు తీరని లోటు … నిర్మాత, నటుడు, అనలిస్ట్‌ త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు