Temple Encroachment| గుడిని మింగేసిన ఆక్రమార్కులు..వైరల్ పోస్టు
పటాన్ చెరువు జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఉన్న ప్రాచీన గుడి దుస్థితిని చాటుతున్న ఫోటోలను నెటిజన్ షేర్ చేయగా..అవి వైరల్ గా మారాయి.

విధాత, హైదరాబాద్ : ఆక్రమార్కులు తలుచకుంటు గుడిలో లింగాన్నే కాదు..గుడిని కూడా మాయం చేయగలరనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన. కబ్జాదారులు..అధికారయంత్రాంగం అంతా కలిసి ఓ గుడిని భూగర్భంలోకి నెట్టేసిన(Temple Encroachment) ఫోటోలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా..అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. పటాన్ చెరువు(Patancher) జీహెచ్ఎంసీ( GHMC) కార్యాలయం పక్కనే ఉన్న ఆ గుడి(Old Temple)దుస్థితిని చాటుతున్న ఫోటోలను నెటిజన్ షేర్ చేశారు. ఆ పోస్టును సీఎం రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ప్రస్తుతం పూర్తిగా రెండు వైపుల రోడ్ల కారణంతో పాటు చుట్టుపక్కల వారి ఆక్రమణల దెబ్బకు ఆ గుడి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యే దుస్థితిలో కి చేరుకుంది. అయినప్పటికి తన ఉనికిని చాటుతూ..నేను ఉన్నాను..నన్ను పునరుద్దరించేవారు లేరా అన్నట్లుగా భూమిలోని నుంచి తలపైకెత్తి చాటినట్లుగా గుడి ప్రాకారాలు, స్తంభాలు, పైకప్పు లు కనిపిస్తున్నాయి. శిధిలావస్థలో ఉన్న గుడిని శుభ్రం చేసి..ఆక్రమణలు తొలగిస్తేగాని..ఆ దేవాలయం చరిత్ర, వివరాలు..లోపల ఏ విగ్రహాలు ఉన్నాయి..గుడికి సంబంధించి ఏదైన స్థలం ఉందా అన్న వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు.