Dhanvantari well | ఈ ధన్వంతరీ బావి నీళ్లు తాగితే సర్వరోగాలు మాయం.. ఎక్కడుందో తెలుసా..?
Dhanvantari well | భారతదేశంలోని అనేక అద్భుతమైన దేవాలయాల గురించి మనం వింటున్నాం. ఉత్తరప్రదేశ్‌లో కాశీగా ప్రసిద్ధి చెందిన వారణాసిలో కూడా అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ నగరంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు మాత్రమే కాదు, ఇక్కడి మంచి నీళ్లు కూడా. ఇక్కడి ధన్వంతరి బావి నీళ్లు తాగితే సర్వరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం. మరి ఈ ధన్వంతరి బావి ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
Dhanvantari well : భారతదేశంలోని అనేక అద్భుతమైన దేవాలయాల గురించి మనం వింటున్నాం. ఉత్తరప్రదేశ్‌లో కాశీగా ప్రసిద్ధి చెందిన వారణాసిలో కూడా అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ నగరంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు మాత్రమే కాదు, ఇక్కడి మంచి నీళ్లు కూడా. ఇక్కడి ధన్వంతరి బావి నీళ్లు తాగితే సర్వరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం. మరి ఈ ధన్వంతరి బావి ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
ధన్వంతరి బావి..
వారణాసిలోని ప్రసిద్ధ మృత్యుంజయ మహదేవ్ అలయ ప్రాంగణంలో ఈ ధన్వంతరి బావి ఉన్నది. ఈ బావి నీళ్లకు సర్వరోగాలను నయం చేసే శక్తి ఉన్నదని ప్రజల విశ్వాసం. ఈ బావి నీళ్లు తాగేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. కాశీలో ఉన్న ఈ బావిలో ఔషధాలు ఉన్నాయని నమ్ముతారు. అందుకే ఈ బావిని ‘ధన్వంతరి బావి’ అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.
బావిలో ధన్వంతరి ఔషధాలు..
వేదాలకు, ఆయుర్వేదానికి అధిపతి అయిన ధన్వంతరి తన ఔషధాలన్నింటినీ ఈ బావిలో పెట్టాడని ఒక నమ్మకం. అందుకే ఈ బావి నీటిని తాగడం వల్ల పొట్ట, చర్మవ్యాధులతోపాటు ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నారని చెబుతారు. భగవాన్ ధన్వంతరి తన మూలికా ఔషధాలన్నింటినీ ఇక్కడ ఉంచి ధన్వంతేశ్వర్ మహాదేవ్‌ను కూడా స్థాపించాడు. ఈ బావికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇది పూర్తిగా ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
వారణాసిలో ఉన్న ధన్వంతరి ఆలయంలో మొత్తం ఎనిమిది ఘాట్‌లు ఉన్నాయి. వివిధ ఘాట్‌ల నుంచి వివిధ రకాలైన అమృతం లాంటి జలాలు వెలువడతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఘాట్‌ల నుంచి నీటిని ఇంటికి తీసుకెళ్తుంటారు. ఈ అష్టభుజి బావిలో ఎనిమిది గిరీల నుంచి నీళ్లు పోస్తారు. ఎనిమిది ఘాట్ల నీటిలోని లవణీయత ఇక్కడి నీటిలో స్పష్టంగా కనిపిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram