Road accident | ఘోర రోడ్డు ప్రమాదం.. పాల ట్యాంకర్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీ.. 18 మంది మృతి

Road accident : ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామునే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నావ్‌ పట్టణంలో ఓ పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.

  • By: Thyagi |    national |    Published on : Jul 10, 2024 8:25 AM IST
Road accident | ఘోర రోడ్డు ప్రమాదం.. పాల ట్యాంకర్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీ.. 18 మంది మృతి

Road accident : ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామునే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నావ్‌ పట్టణంలో ఓ పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉన్నావ్‌ పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. డబుల్‌ డెక్కర్‌ బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారికి బంగార్‌మావ్‌ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.