Vastu Tips | భ‌ర్తల‌ సంపాద‌న పెర‌గాలంటే.. భార్య‌లు ఈ చిన్న చిట్కాలు ఫాలో కావాల‌ట‌..!!

Vastu Tips | భ‌ర్త‌ల( Husbands ) సంపాద‌న మీద ఆధార‌ప‌డి జీవించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. మ‌రి ముఖ్యంగా చాలా మంది భార్య‌లు( Wifes ) త‌మ భ‌ర్త‌ల సంపాద‌న కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి భార్య‌లు ఈ చిన్న చిట్కాలు ఫాలో అయితే.. భ‌ర్త‌ల సంపాద‌న అమాంతం పెరుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Vastu Tips | భ‌ర్తల‌ సంపాద‌న పెర‌గాలంటే.. భార్య‌లు ఈ చిన్న చిట్కాలు ఫాలో కావాల‌ట‌..!!

Vastu Tips | త‌న భ‌ర్త( Husband ) బాగుండాల‌ని, బాగా సంపాదించాల‌ని చాలా మంది భార్య‌లు( Wifes ) కోరుకుంటుంటారు. క‌నిపించిన ప్ర‌తి దేవుడిని భర్త‌ల క్షేమం కోరుతూ ప్రార్థిస్తుంటారు. భ‌ర్త‌కు అదృష్టం క‌లిసి రావాల‌ని, మ‌రింత సంపాద‌న( Money ) సంసాదించాల‌ని చాలా మంది భార్య‌ల మ‌న‌సుల్లో ఉంటుంది. అలాంటి భార్య‌లు.. త‌ప్ప‌కుండా కొన్ని నియ‌మాలు పాటిస్తే.. భ‌ర్త సంపాద‌న పెర‌గ‌డ‌మే కాకుండా, అత‌నికి అదృష్టం కూడా క‌లిసి వ‌స్తుంద‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మ‌రి ఆ నియ‌మాలు ఏంటో తెలుసుకుందాం..

భ‌ర్త‌ల సంపాద‌న కోసం భార్య‌లు ఫాలో కావాల్సిన చిట్కాలు ఇవే..

1. ఐదు వారాల పాటు ప్ర‌తీ శుక్ర‌వారం అమ్మ‌వారికి ఎండు ద్రాక్ష‌( Raisins )ను నైవేద్యంగా స‌మ‌ర్పించాలి.
2. కిచెన్‌లో ఉండే యాల‌కులు( Cardamom ) ఎండిపోకుండా, ఆకుప‌చ్చ రంగులోనే ఉండేలా చూసుకోవాలి.
3. ప్ర‌తీ శుక్ర‌వారం(ల‌క్ష్మీ వారం) ప‌సుపు వ‌స్త్రం తీసుకుని అందులో ఐదు యాల‌కులు ఉంచాలి. దాన్ని మూట‌క‌ట్టి బీరువాలో డ‌బ్బు దాచే ప్ర‌దేశంలో ఉంచాలి.
4. తెల్ల‌వారుజామున నిద్ర లేవ‌గానే వినాయ‌కుడి( Lord Vinayaka ) ఫొటోను చూడాలి.
5. మ‌రి ముఖ్యంగా భ‌ర్త ప‌ర్స్‌( Husband Purse )లో ఐదు యాల‌కులు ఉంచాలి. అలా చేయ‌డంతో ల‌క్ష్మీ క‌టాక్షం క‌లుగుతుంద‌ట‌.
6. శుక్ర‌వారం నాడు ప‌సుపు గుడ్డ‌లో ప‌చ్చ క‌ర్పూరం( Camphor  ) ఉంచాలి. మూట‌క‌ట్టి పూజ‌గ‌దిలో పెట్టాలి. ఇక దానికి ప్ర‌తీరోజు అగ‌ర్ బ‌త్తీలు చూపిస్తు ఉండాలి. శుక్ర‌వారం ధూపం వేస్తే భ‌ర్త సంపాద‌న రెట్టింపు అవుతుంద‌ట‌.
7. ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు( Bangles ) ధ‌రించాలి.
8. మంగళవారం, శనివారం గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంద‌ట‌.

భార్య‌లు ఈ ప్ర‌త్యేకమైన పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలసి వస్తుందని, అనేక మార్గాల్లో ధనం స‌మ‌కూరుతుంద‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు కూడా ఫాలో అవ్వండి మ‌హిళ‌ల్లారా..