Site icon vidhaatha

Today Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి వేసే ప్ర‌తి అడుగులో శుభ‌ఫ‌లితాలే..!

horoscope-

మేషం

మేషరాశి వారిని ఈ రోజు లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వేసే ప్రతి అడుగు శుభ ఫలితాలను తెస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.

వృషభం

వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో నిక్కచ్చిగా, ముక్కుసూటితో ప్రవర్తించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులు భవిష్యత్ ప్రయోజనాల కోసం కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిథునం

మిథున రాశి వారికి ఇవాళ‌ అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొంటారు. ఈ కారణంగా కోపం, చిరాకు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు వస్తాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి అన్నింటా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్ధికంగా ఎదగడానికి చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. నిరాశ నిస్పృహలకు దూరంగా ఉంటే మంచిది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఆర్థికపరంగా సంతృప్తికరంగా ఉంటారు. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కోపం, పౌరుష పదాల కారణంగా మీ దగ్గర బంధువులతోనూ సంబంధాలను చెడగొట్టుకుంటారు. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తే మేలు. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. వివాదాలు, అనారోగ్యం, కోపం కారణంగా ఈ రోజంతా అశాంతిగా ఉండవచ్చు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం ఈ రోజు మీకు అనేక అవకాశాలు తీసుకువస్తుంది. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మీ పని తీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తితో ఉంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. సహచరులు, సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు చక్కదిద్దుతారు. నూతన బాధ్యతలను చేపడతారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవివాహితులు తమకు కాబోయే జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్ధిక వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీరికలేని పనులతో విశ్రాంతంగా పనిచేసి అలసిపోతారు. మీకై మీరు కొంత సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని కలవరపెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి ఊహించని గొప్ప అవకాశాలు ఎదురవుతాయి. అనుకోని ధనలాభం ఉంటుంది. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు.

Exit mobile version