Trigrahi Raj Yoga | నవంబర్ నెలలో త్రిగ్రాహి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి విపరీతమైన ధనలాభం..!
Trigrahi Raj Yoga | గ్రహాల( Planets ) కలయికల కారణంగా పలు రాశుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. ఆ మాదిరే నవంబర్( November ) నెలలో జరిగే గ్రహాల కలయికల కారణంగా త్రిగ్రాహి రాజయోగం( Trigrahi Raj Yoga ) ఏర్పడనుంది. దీంతో ఈ మూడు రాశుల( zodiac Signs ) వారికి విపరీతమైన ధన లాభం కలగనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులు ఏవో చూద్దాం..
Trigrahi Raj Yoga | జ్యోతిష్య శాస్త్రంలో యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల( Planets ) కలయిక కారణంగా ఏర్పడే ఈ యోగాలు.. ఆయా రాశుల వారి జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకువస్తాయి. ఆర్థికంగా, సామాజికంగా గౌరవాన్ని తెచ్చిపెడుతాయి. అయితే నవంబర్( November ) నెలలో మూడు రాశులు( Zodiac Signs ) ఒకే రాశిలో కలవనున్నాయి. దీంతో అద్భుతమైన త్రిగ్రాహి రాజయోగం( Trigrahi Raj Yoga ) ఏర్పడనుంది. కుజ గ్రహం, సంపదకు చిహ్నంగా భావించే శుక్ర గ్రహం, గ్రహాలకు రాజైనటువంటి సూర్యగ్రహం వృశ్చిక రాశి( Scorpio )లో కలవనున్నాయి. ఈ కలయిక 12 రాశులపై ప్రభావం చూపనుంది. కానీ ఈ మూడు రాశుల వారికి మాత్రం ఆర్థిక కష్టాలు తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం..
వృశ్చి క రాశి ( Scorpio )
కుజ గ్రహం, శుక్ర గ్రహం, సూర్య గ్రహం.. ఈ మూడు కూడా ఈ నెలలో వృశ్చిక రాశిలో కలవనున్నాయి. దీంతో వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడడంతో సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి మూడు గ్రహాల కలయిక, వలన సంపద పెరుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మీన రాశి ( Pisces )
మీన రాశి వారికి వ్యాపారంలో అత్యధిక లాభాలు వస్తాయి. ఎవరైతే రియలెస్టేట్ రంగంలో ఉన్నారో, వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఈ రాశి వారు ఈ మాసం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram