Zodiac Signs | దీపావ‌ళి రోజున అరుదైన యోగం.. ఈ మూడు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Zodiac Signs | దీపావ‌ళి పండుగ( Diwali Festival ) రోజు అరుదైన త్రిగ్రహి యోగం( Trigrahi yoga ) ఏర్ప‌డ‌బోతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ యోగం గ్ర‌హాల‌కు రాజైన సూర్యుడు( Sun ), వ్యాపార కార‌కుడు అయిన బుధుడు, ధైర్యం, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్ర‌తీక‌గా భావించే కుజుడుని ఈ యోగం ఏకం చేస్తుంద‌ని చెబుతున్నారు. ఈ యోగం కార‌ణంగా మూడు రాశుల( Zodiac Signs ) వారికి ప‌ట్టింద‌ల్లా బంగారం కానుంద‌ని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

  • By: raj |    devotional |    Published on : Oct 14, 2025 6:52 AM IST
Zodiac Signs | దీపావ‌ళి రోజున అరుదైన యోగం.. ఈ మూడు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Zodiac Signs | దేశ వ్యాప్తంగా దీపావ‌ళి( Diwali ) శోభ సంత‌రించుకుంది. మ‌రో వారం రోజుల్లో దీపావ‌ళి పండుగ( Diwali Festival ) జ‌రుపుకోనున్నారు. అశ్వ‌యుజ మాసం అమావాస్య రోజున జ‌రుపుకునే ఈ దీపావ‌ళికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఆ రోజున న‌వ‌గ్ర‌హాల‌కు అధినేత అయిన సూర్యుడు( Sun ), గ్ర‌హాల రాకుమారుడు బుధుడు, కుజుడి క‌ల‌యిక జ‌ర‌గ‌నుంది. దీంతో శ‌క్తి వంత‌మైన త్రిగ్ర‌హి యోగం( Trigrahi yoga ) ఏర్ప‌డ‌నుంద‌ని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ యోగం మొత్తం 12 రాశుల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. కానీ మ‌రి ముఖ్యంగా ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి అదృష్టం క‌లిసి వ‌స్తుంది. ఆర్థిక లాభాలు పొంది ప‌ట్టింద‌ల్లా బంగారమే కానుంద‌ని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. మ‌రి ఆ మూడు అదృష్ట రాశులు ఏవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

తులా రాశి( Libra )

దీపావ‌ళి రోజున తులా రాశిలో త్రిగ్ర‌హి యోగం ఏర్ప‌డ‌నుంది. దీంతో తులారాశి వారికి చాలా అనుకూల‌త‌లు ఏర్ప‌డ‌నున్నాయి. ఈ యోగం ల‌గ్న‌స్థాన‌మైన తులారాశిలో ఏర్ప‌డుతుంది కాబ‌ట్టి ఈ రాశివారు ఆత్మ‌విశ్వాసాన్ని పొందుతారు. త‌ద్వారా స‌మాజంలో కూడా ఆత్మ‌గౌర‌వాన్ని పొందుతారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను కూడా పూర్తి చేస్తారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం వ‌ల్ల ఆర్థికంగా కూడా లాభం పొందుతారు.

ధ‌నుస్సు రాశి( Sagittarius )

ఈ త్రిగ్రహి యోగం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆదాయం, లాభదాయక ఇంట్లో ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తుల ఆదాయం పెరగవచ్చు. కొత్త ఆదాయ వనరులు మార్గాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ధనుస్సు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయం శుభాసమయం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసే అవకాశం ఉంది.పెట్టుబడుల నుంచి లాభాలను ఆర్జించవచ్చు.

మకర రాశి( Capricorn )

దీపావళి రోజున ఏర్పడే ఈ త్రిగ్రహి యోగం వల్ల మకర రాశి వారికి మంచి సమయం ప్రారంభం అవుతుంది. ఈ యోగం మకర రాశి వారి కర్మ భావంలో ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో మకర రాశి వారు తమ పని, వ్యాపారంలో పురోగతిని పొందనున్నారు. కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. పాత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న స్థానానికి బదిలీ చేయబడవచ్చు.