Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజున ఈ ఆలయాలను దర్శించాల్సిందే..! అంత ప్రాముఖ్యత ఏముందంటే..?
Akshaya Tritiya | అక్షయ తృతీయకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ వచ్చింది. ఆ రోజున ఎలాంటి శుభముహూర్తాలు లేకపోయినా కొత్త పనులు, శుభకార్యాలు చేసుకోవడంతో పాటు నూతన గృహాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. పలుప్రాంతాల్లో అదే రోజున రథశత్రం ప్రారంభమవుతుంది. అక్షయ తృతీయ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి.

తెరచుకోనున్న కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామాలు
అక్షయ తృతీయ రోజున ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆలయాలన్నీ తెరచుకోనున్నాయి. బద్రీనాథ్ ఆలయ ద్వారాలను తెరువనున్నారు. ఆలయ తలుపులను ఆరునెలల పాటు మూసివుంచుతారనే విషయం అందరికీ తెలిసిందే. దీపావళి తర్వాత ద్వారాలను మూసివేయగా.. మళ్లీ అక్షయ తృతీయ రోజునే తెరువడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయ ద్వారాలు మూసి ఉన్న రోజుల్లో దేవతలు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజిస్తారని స్థలపురాణం. ఏటా ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు. బ్రదినాథ్‌తో పాటు కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు సైతం అదే రోజు తెరవనున్నారు.
ఒడిశాలో అక్షయ తృతీయ ప్రత్యేకం
ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలో అక్షయ తృతీయకు ప్రత్యేకత ఉన్నది. వాస్తవానికి ఏటా జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ ప్రయాణంలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి వేర్వేరు రథాలపై కొలువుదీరుతారు. ఏటా రథయాత్రకు అక్షయ తృతీయ రోజునే కొత్త రథాలను చెక్కే పనులు ప్రారంభమవుతాయి. పాండాలు జగన్నాథుని నుంచి దండలు తీసుకుంటారు. అంతేకాదు, ఇక్కడ రథం నిర్మాణానికి ముందు పూజలు సైతం చేస్తారు.
సింహాచలం అప్పన్న నిజరూపదర్శనం..
ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఉన్నది. అక్షయ తృతీయ రోజును వరాహ నరసింహస్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారు. భగవంతుడు ఏడాది పొడవునా గంధపు కప్పబడి శివలింగం ఆకారంలో కనిపిస్తుంటారు. అయితే, అక్షయతృతీయ రోజున గంధాన్ని తొలగించి.. స్వామివారి నిజరూపం దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
కుంభకోణంలో గరుడ సేవ ఉత్సవాలు
తమిళనాడు కుంభకోణంలోని ఆలయంలో అక్షయ తృతీయ రోజున గరుడ సేవ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున సమీపంలోని 12 ప్రసిద్ధ దేవాలయాల్లోనూ అక్షయ తృతీయను భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
బాంకే బీహారి పాదాల దర్శనం..
అక్షయ తృతీయ రోజున ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని బాంకే బిహారీ దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబువుతుంది. భక్తులు భగవంతుడి పాద పద్మాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడి పాదాలను ఏడాది పొడవునా తామరపూలతో కప్పి ఉంటాయి. కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే చూసేందుకు భక్తులకు అనుమతి ఇస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram