Puri Jagannath Temple | పూరీ జగన్నాథ ఆలయ రహస్యం – ఏముందక్కడ?

Puri Jagannath Temple | ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన జగన్నాథ ఆలయం, హిందూ ధర్మంలోని చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన దైవక్షేత్రం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాల, ప్రాచీన విశ్వాసాల కేంద్రం కూడా. అలాంటి విశ్వాసాల్లో ముఖ్యమైనది – ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ఉన్న మూడో మెట్టు పై ఉన్న గాథ.

Puri Jagannath Temple | పూరీ జగన్నాథ ఆలయ రహస్యం – ఏముందక్కడ?

• ఆలయ ముఖద్వార మూడోమెట్టు కథ
• ఈ యమశిల అంటే ఏంటి?

Puri Jagannath Temple | జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది భక్తులు జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర అమ్మవార్ల రథాలను దర్శించేందుకు పూరీకి తరలివచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్నాథ ఆలయ రహస్యాల్లో ఒకటి – మూడో మెట్టు(Third Step) కథ వెలుగులోకి వచ్చింది.

22 మెట్లు – మూడోది మాత్రంమృత్యుస్థానం!

జగన్నాథుడి ఆలయంలోకి ప్రవేశించాలంటే 22 మెట్లు ఎక్కాలి. వీటిలో మూడో మెట్టు (కిందనుంచి మూడవది) పవిత్రతతో పాటు ఒకరకమైన ఆధ్యాత్మిక భయంగొలుపుతూ ఉంటుంది. ఈ మెట్టును “యమశిల(Yamashila)” అని పిలుస్తారు – అంటే యమధర్మరాజు నివసించే స్థానం అని విశ్వాసం.

పౌరాణిక గాథ ఏంటంటే… పురాణాల ప్రకారం, ఒక సందర్భంలో యమధర్మరాజుజగన్నాథుని దర్శించడానికి వచ్చాడు. అప్పటికే జగన్నాథుని దర్శనం చేసిన భక్తులు సర్వపాప విముక్తులై, యమలోకానికి రావడం మానేశారని తెలుసుకొని యముడు ఆందోళన చెందాడు.అప్పుడు జగన్నాథుడు స్పందిస్తూ,”నా దర్శనం చేసినవాడెవడైనా ఈ ఆలయ ముఖద్వార మూడో మెట్టును తొక్కితే, అతడు నీలోకానికి రావాల్సిందే. ఇది నీ స్థానం” అని చెప్పాడట. అప్పటి నుండి ఈ మెట్టు యమశిలగా ప్రఖ్యాతి పొందింది.

జగన్నాథుని దర్శనం అనంతరం భక్తులు ఈ మూడో మెట్టును తాకకుండా దాటి వెళ్తారు. కొంతమంది ఆ మెట్టుకు తలతోనమస్కరిస్తారు కానీ అడుగుమాత్రం వేయకుండా ఎంతో జాగ్రత్తగా దాటుతారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.

మెట్టుకు ప్రత్యేక గుర్తింపు

ఇది సాధారణ మెట్లలాగా కాకుండా ప్రత్యేకంగా కనిపించేలా నల్లని రంగులో ఉంటుంది. ఆలయ అధికారులు భక్తులు పొరపాటు పడకుండా చూడటానికి ఈ మూడో మెట్టుకు నలుపు రంగు వేశారు. మిగతా మెట్లు మాత్రం సాధారణ రంగులో ఉంటాయి.ఇది కేవలం ఒక మెట్టు కథ మాత్రమే కాదు – ఆధ్యాత్మికత, భయం, విశ్వాసంకలసిన నమ్మకం. ప్రతి అడుగు వెనుక ఓ గాథ ఉందని, ప్రతి మెట్టులో దేవతల సాన్నిధ్యం ఉన్నదని ఈ ఆలయం నిరూపిస్తోంది.

ఈ యమశిల కథ, భక్తుల మనస్సుల్లో భక్తి మాత్రమే కాదు, ఓ అపార గౌరవాన్ని, ఆధ్యాత్మికమైన బాధ్యతను సైతంగుర్తుచేస్తూఉంటుంది.ఇదే కాకుండా, జగన్నాథ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలు, విశ్వాసాలు భక్తులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.