Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగుల చిరకాల కోరిక నేరవేరుతుంది..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాలతో అధికారులను, సహఉద్యోగులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కీలక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సహకారంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. వృత్తి పరంగా స్వల్ప ఆటంకాలున్నా చివరకు విజయం సిద్ధిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. వీలైనంత వరకు పని ప్రదేశంలో ఆచి తూచి నడుచుకోండి. అనవసర ఘర్షణలు, వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆలస్యంగా అయినా ఆశించిన లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు పెరుగుతాయి. ఆశించిన రుణాలు మంజూరవుతాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రేమికులు మధురమైన క్షణాలు ఆస్వాదిస్తారు. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలం కాదు. ఎంత కష్టపడినా ఫలితాలు మాత్రం నిరాశ పరుస్తాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పరిస్థితులు అస్థిరంగా ఉంటాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. కీలక నిర్ణయాల విషయంలో అందరినీ కలుపుకుని పోవడం మంచిది. ముందుచూపుతో వ్యవహరిస్తే ఆర్థిక నష్టాలు నివారించవచ్చు. కొత్తగా ప్రారంభించబోయే పనులు వాయిదా వేస్తే మంచిది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులు మెరుగైన ఫలితాల కోసం అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితితో ఉండడం అవసరం. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి జీవిత భాగస్వామితో అవగాహన, సహనంతో ముందుకు సాగాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే కుటుంబ కలహాలు ఉండవు. విద్యార్థులు చదువులో విజయం సాధించాలంటే మరింత శ్రద్ధ వహించాలి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరంగా మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. కెరీర్ కు ఆటంకం కలిగించే ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పథకాలపై దృష్టి సారిస్తే మంచిది. వైవాహిక జీవితంలో, అనవసరమైన ఒత్తిడి తలెత్తవచ్చు. సహనంతో ఒత్తిడిని అధిగమించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలకు తావు లేకుండా చూసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రయోజనాలను పొందుతారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలనే ఆశించవచ్చు. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కెరీర్ లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపార పరంగా ఆదాయాన్ని పెంచే ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందుకుంటారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఉద్యోగస్తులు పట్టుదల, ఏకాగ్రతతో విజయం సాధించగలరు. ప్రేమ సంబంధాల్లో నిజాయితితో మెలగాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. అవగాహన, సహనంతో ఒత్తిడిని అధిగమించవచ్చు. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. కోపావేశాలు, మాటతీరుని అదుపులో ఉంచుకుంటే మంచిది. స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలలో వారం ప్రథమార్ధం అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారాన్ని అందుకుంటారు. వ్యాపారులకు వ్యాపార పరంగా చేసే పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌లు సజావుగా సాగి మంచి ఫలితాలను తెస్తాయి. వారం ద్వితీయార్ధంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు, బదిలీలు పొందుతారు. వ్యాపారులు ప్రస్తుత వ్యాపారాన్ని కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే మంచిది. పెట్టుబడుల విషయంలో ప్రణాళిక, ఆలోచనాత్మక నిర్ణయాలు అవసరం. దీర్ఘకాలిక స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. పెద్ద లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముందు జాగ్రత్తగా ఉంటే ఖర్చులు తగ్గుతాయి. డబ్బు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ప్రేమికుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. వైవాహిక జీవితంలో అనుకోని సమస్యలు, ఒత్తిడి తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో వాదనలను నివారించండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. వ్యాపారులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతుల కోసం తీవ్రంగా శ్రమించాలి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంబిస్తే మంచిది. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. లక్ష్మీ కటాక్షం ఉంది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. వ్యాపారులకు ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ, ఊహించని లాభాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగులు చాలా కాలంగా బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వారం చివరలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రేయోభిలాషుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళను అవకాశాలుగా మలచుకొని ముందుకు దూసుకెళ్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. స్దానచలనం సూచన ఉంది. వారం మధ్యలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. కానీ సమయస్ఫూర్తితో సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థిక పరంగా శుభ ప్రయోజనాలను అందుకుంటారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. బుద్ధిబలంతో ఆటంకాలు అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రుణభారం తగ్గవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, పెద్దల సహకారంతో తొలగిపోతాయి. విద్యార్థులు పట్టుదల, కృషితో విజయాన్ని సాధించగలరు.