Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహనయోగం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 28, 2025 6:30 AM IST
Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహనయోగం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం సామాన్య ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులు ఈ వారం అత్యంత జాగరూకతతో ఉండాలి. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. ఎవరితోనూ వివాదాలకు దిగడం మంచిది కాదు. సమయ పాలనతో, క్రమశిక్షణతో పనిచేయడం వలన ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు కూడా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి, ఆశించిన లాభాలు పొందడానికి నిరంతర కృషి అవసరం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అవసరానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కర్తవ్యాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో సకాలంలో తీసుకునే నిర్ణయాలతో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. నిరంతర కృషితో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు అందిస్తాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. నూతన గృహయోగం ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అయితే ఉద్యోగరీత్యా అధికంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ధనయోగాలు బలంగా ఉన్నాయి. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులు అవుతారు. అనేక మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు కొంత గందరగోళాన్ని సృష్టించవచ్చు. కుటుంబంలో సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని ప్రదేశంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచిది. వ్యాపారంలో పోటీ పెరగడంతో లాభాలు కూడా తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో వాదనలు ఒత్తిడి కలిగించవచ్చు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ రంగాల వారికి అనుకూలమైన సమయం. వ్యాపారులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు, నూతన ఒప్పందాలు చేసుకోడానికి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం, ఆర్థికవృద్ధి ఉంటాయి. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మిశ్రమ సమయం. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు దూరం పెంచుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోండి. నూతన గృహ, వాహనయోగం ఉన్నాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఉండవచ్చు. ప్రతి విషయంలోనూ సహనం, ఓర్పు అవసరం. వ్యాపారులకు కొంత కష్టకాలం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన సమయం కాదు. అభివృద్ధికి చేసే ప్రయత్నాలు నష్టానికి దారి తీయవచ్చు. ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. సహోద్యోగులతో సామరస్యంగా మెలగాలి. అధికారాల ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్త వహించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా గడ్డు సమయం. కొత్త పెట్టుబడులు కలిసిరావు. వృథా ఖర్చులు పెరుగుతాయి. మొహమాటంతో రుణభారం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అహాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లడం అవసరం. వైవాహిక జీవితంలో కొంత గందరగోళం నెలకొంటుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. వ్యాపారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ను అందుకుంటారు. నిరంతర కృషితో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. స్వస్థాన బదిలీ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా గొప్ప సమయం. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అధిక లాభాలు అందిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో దూరం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు అశాంతి కలిగిస్తాయి. కుటుంబంలో ఉద్రిక్తపూరిత వాతావరణం ఉండవచ్చు. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగులు సహచరుల సహాయంతో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు తెలివిగా పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఆర్జిస్తారు. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి.దాయ మార్గాలు పెరుగుతాయి. ప్రేమలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ గృహ వాహన యోగాలున్నాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం ఉంటాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబం, వృత్తి మధ్య సమతుల్యతను పాటించడం వల్ల శాంతి పెరుగుతుంది. వృత్తి సంబంధిత ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉండవచ్చు. ప్రేమలో ఉన్నవారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారు మంచి ఫలితాలు పొందవచ్చు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు పొందుతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అదనపు రాబడితో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. పెట్టుబడులు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దైవదర్శనం కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు సరైన సమయంలో, సరైన చోట పెట్టుబడులు పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేయండి. ఉద్యోగంలో పెద్ద ఆటంకాలేమి లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా బాగుంటుంది. స్థిరాస్తులు కొనడానికి, ఆస్తులు వృద్ధి చేయడానికి సరైన సమయం. ప్రేమికుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు అహాన్ని పక్కన పెట్టి ప్రయత్నిస్తే తొలగుతాయి.