Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికులకు పెళ్లి బాటలు పడుతాయి..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కెరీర్‌లో పురోగతి, ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోండి. వారం చివరలో వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి ఉండవచ్చు. ఇతరుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం ఆశించినట్లే ఉంటుంది. కానీ కొన్ని ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనారోగ్య నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో చాలా సమస్యలు ఏర్పడవచ్చు. ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి కలిగినా ఓర్పుతో ముందుకు సాగాలి. ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగంలోనే కొనసాగడం ఉత్తమం. ఉద్యోగ మార్పునకు ఇది సరైన సమయం కాదు. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో, అపార్థాలు దూరాన్ని పెంచే అవకాశముంది. కాబట్టి సమాచార లోపం లేకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం సమస్యలు కలిగించవచ్చు. వైద్య చికిత్స కోసం డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. వ్యాపార నిపుణులు కొత్త పరిచయాలు, ఒప్పందాల ద్వారా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రతతో విజయం సాధించగలరు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. నిరుద్యోగులు ఈ వారం మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో బంధాలు బలోపేతం అవుతాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళతారు. ఆదాయం పెరుగడం సంతోషం కలిగిస్తుంది. ఇంటి అలంకరణ కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు అధిక లాభాలు అందిస్తాయి. వారం చివరలో పనిభారంతో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో నూతన ఆదాయ అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మంచి సమాచార నైపుణ్యంతో అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుని సహనంతో వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా ఎదగడానికి అదనపు కృషి అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆశించిన దానికంటే అధిక ధనలాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ముందస్తు ప్రణాళికతో పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం. ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఏర్పడ్డ సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించగలరు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. గతం కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో క్రమశిక్షణ అవసరం. వ్యాపారంలో తీవ్రమైన పోటీ కారణంగా నష్టాలు ఉండవచ్చు. ఊహించని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అవసరానికి ధనం అందకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భూమి, ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఏర్పడకుండా ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది. కుటుంబ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పట్టుదల పెంచాలి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కెరీర్ పరంగా అందుకునే నూతన అవకాశాలు కొత్త ఆశ, ఉత్సాహం తెస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో పనిచేసి వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రత్నించే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో అపార్థాలు తలెత్తవచ్చు. సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడితే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా పడాలి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. వ్యాపారవేత్తలు వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి చూస్తే మంచిది. ప్రేమ వ్యవహారాలు కలిసిరావు. కుటుంబ కలహాల కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు విజయం సాధించడానికి శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా మంచి ఫలితాలు రాబట్టాలంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో పని చేసి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బలమైన సంకల్పశక్తితో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో చిన్న చిన్న సవాళ్లు ఉన్నా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి బాట పడతాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుది. విద్యార్థులు పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన ప్రగతిని సాధిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు కూడా అందుతాయి. కోరుకున్న రుణాలు మంజూరవుతాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనువైన సమయం. ఉద్యోగ మార్పు కోరుకునేవారు ప్రభుత్వ రంగంలో మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య పరంగా పాత ఆరోగ్య సమస్యలు తిరిగి రావచ్చు, అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.