Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికులకు వివాహ యోగం..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎంత కష్టపడితే అంతే గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో పట్టుదల లోపించకుండా చూసుకోండి. వ్యాపారులకు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. షేర్ మార్కెట్లు, స్థిరాస్తి పెట్టుబడులు లాభాలు తెచ్చి పెడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు ఉంటుంది. ఖర్చులు అదుపు చేయడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. వి
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి పనిభారం, ఒత్తిడి పెరిగే సూచన ఉంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని తగినంత ఖర్చులు కూడా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితంలో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. రుణభారం తొలగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రేమికుల మధ్య సయోధ్యత నెలకొంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి లాభాలు ఆర్జిస్తారు. స్టాక్ మార్కెట్‌లో, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టినవారు మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. నూతన గృహ యోగం, వాహన యోగం ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతితో ఉండడం అవసరం. కుటుంబం సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ అర్హతకు తగిన పదోన్నతులు పొందుతారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగితే మంచిది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. అన్ని రంగాల వారికి సిరిసంపదలు, విజయాలు సమృద్ధిగా ఉంటాయి. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. మిత్రుల సహాయంతో కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతోనే విజయాలను పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అత్యంత శుభ సమయం నడుస్తోంది. అదృష్టం వరించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగులు వారం ప్రారంభంలో గొప్ప అవకాశాలు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉంటాయి. పై స్థాయి అధికారులతో పరిచయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. ఆస్తులు వృద్ధి చేస్తారు. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలుండవచ్చు. పనిపట్ల బాధ్యతతో ఉండాలి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ, ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రేమికులకు వివాహయోగం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రద్ధాసక్తులు తగ్గకుండా చూసుకోండి. నూతన ఆదాయ వనరులు అన్వేషిస్తారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అపార్థాలకు చోటు లేకుండా చూసుకుంటే మంచిది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏకాగ్రత, పట్టుదలతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. వ్యాపారులు వ్యాపారపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బల పడుతుంది. ప్రియమైనవారితో విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది.
ఇవి కూడా చదవండి..
Banakacharla | ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఉచిత పథకాలకంటే డేంజర్.. బనకచర్ల!
Dengue Alert | డెంగ్యూ మళ్లీ వచ్చేసింది.. భద్రం!
Polavaram A water Bomb? | కాళేశ్వరం తరహాలో పోలవరానికి సీపేజ్ రూపంలో పెను ముప్పు?
Telangana politics | సరసాలు.. సంచులు.. కాంట్రాక్టులు.. దందాలు! వీటి చుట్టూనే తెలంగాణ చర్చలు!