జులై 28 నుంచి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు.. మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

జులై 28 నుంచి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు.. మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మీ పని తీరుతో అందరినీ మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వృత్తి వ్యాపార రంగంలో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే, నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులు, స్థిరాస్తి రంగం వారు గణనీయమైన లాభాలు పొందవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

వృషభం

ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలకమైన పురోగతి ఉంటుంది. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో విజయ పరంపరలు కొనసాగుతాయి. ఉన్నత పదవులను చేపడతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్సులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం

మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. తమ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం కూడదు. వ్యాపారంలో వారం మధ్యలో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో కలహాలకు స్వస్తి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

కర్కాటకం

ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు తమ తమ రంగాలలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు ఈ వారం పొందుతారు. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంది. న్యాయపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వలన గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

సింహం

సింహరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సిరిసంపదలు, విజయాలు సమృద్ధిగా ఉంటాయి. విజయోత్సాహంతో ఉరకలేస్తూ ఉంటారు. అయితే అత్యుత్సాహం పనికిరాదు. ఎవరి మనసు నొప్పించే విధంగా మాట్లాడవద్దు. పోటీ పరీక్షల కోసం తయారవుతున్న విద్యార్థులు కష్టపడితే అద్భుతమైన విజయాలను పొందగలరు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరకడంతో ప్రశాంతంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కన్య

కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోండి. అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆర్ధిక సంక్షోభం తలెత్తుతుంది. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఓర్పుతో సహనంతో ఉండండి. వారం చివరలో మీ జీవిత భాగస్వామి చొరవతో అన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

తుల

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులు విపరీతమైన లాభాలను పొందుతారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సినీరంగం, కళాకారులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అదృష్టవంతులుగా, లాభదాయకంగా ఉంటారు. ఆర్థిక విజయాన్ని పొందుతారు. వ్యాపారులు వ్యాపారంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులను పొందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్ధాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం. విజయం కచ్చితంగా లభిస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఆర్ధిక పరంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిది. లేకుంటే ఎదురయ్యే నష్టాలు తట్టుకోవడం కష్టం. ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, మీరు అదనపు రాబడి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధు వర్గం నుంచి అందిన ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం.

కుంభం

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విశేషమైన ధనలాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయట పడతారు. మీడియా వారు గొప్ప సాహసంతో నిజాలను వెలికి తీస్తారు. ఆర్ధికంగా పుంజుకుంటారు. విలాసానికి సంబంధించిన వస్తువులపై ఎక్కువ ధనం వెచ్చిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీనం

మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తీవ్రమైన కృషితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. జీవిత భాగస్వామితో తీర్ధ యాత్రలకు వెళ్తారు.