Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఖ‌ర్చులు, ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఉద్రిక్త‌త‌లు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఖ‌ర్చులు, ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఉద్రిక్త‌త‌లు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రత, శ్రద్ధ పెంచాలి. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సిఉంటుంది. వ్యాపారులు నూతన ప్రాజెక్టుల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాభాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. పెట్టుబబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలకు తావు లేకుండా చూసుకోండి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపితే కుటుంబ సమస్యలను తొలగిపోతాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. రుణభారం తగ్గుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు భారీ లాభాలు అందిస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు అందుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్థానచలనం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్ధికంగా ఆశించిన ధనలాభాలున్నాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేయడం మంచిది. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. నూత‌న బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఆలస్యమైనా శుభ ఫలితాలే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే ఆర్ధిక సమస్యలు ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంలో అనుకోని సమస్యలు, అనవసరమైన వాదనలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలు తొలగిపోతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి దరి చేరకుండా జాగ్రత్త పడండి. ఆర్థికంగా, ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రుణాల వసూలు భారంగా మారుతుంది కాబట్టి ఎవరికీ అప్పులు ఇవ్వద్దు. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వాములు ఏకపక్ష ప్రవర్తనను అపార్ధాలకు అవకాశమిస్తుంది. కుటుంబంలో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువు ఇవ్వడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అధికారులకు ఆగ్రహం రాకుండా జాగ్రత్త మసలుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగ మార్పు కోసం చూసే వారు ఈ వారం మంచి అవకాశాలు అందుకుంటారు. ఆర్ధికంగా మిశ్రమ సమయం. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. పెరిగే ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు అంత లాభదాయకం కాదు. ఊహించని విధంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. లక్ష్య సాధనపై దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారులు తమ వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వారం ఆరంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగులు నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. కుటుంబ సమస్యల కారణంగా జీవిత భాగస్వామితో విభేదాలను ఎదుర్కోవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్ధిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. వారం చివరిలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టం కల్గిస్తాయి. వ్యాపారులు తొందరపడి పెద్ద పెట్టుబడులు పెడితే ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు. ఆర్ధిక విషయాలలో ఆచి తూచి నడుచుకోవాలి. ఉద్యోగులు పదోన్నతులు అందుకునే అవకాశముంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం ఆర్థికంగా ధనవ్యయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సమస్యలున్నా అనుకూలంగానే ఉంటాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. నూతన బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది, కాబట్టి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు అనుకూలం కాదు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం.