సెప్టెంబ‌ర్ 29 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

సెప్టెంబ‌ర్ 29 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు..!

మేషం

ఈ రాశి వారికి సమాజంలో గౌరవం, ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తిచేయండి. విద్యార్థులు త‌మ చ‌దువుల్లో రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అన్ని రంగాల వారు సంయమనంతో ఉండటం అవసరం. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు.

వృషభం

ఈ రాశి వారికి ఈ వారం వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. తలపెట్టిన ప్ర‌తి ప‌ని లాభదాయకంగా పూర్తవుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం

ఈ రాశి వారికి ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. వారం మొద‌ట్లో చేప‌ట్టిన‌ కొన్ని పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నించి పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు పై అధికారులతో, తోటివారితో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

కర్కాటకం

ఈ రాశి వారు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారుల స్నేహంతో మంచిపేరు సంపాదిస్తారు. సహోద్యోగులతో పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి.

సింహం

ఈ రాశి వారికి పాతబాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సంయమనంతో పనులు చేయడం అవసరం. న‌లుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు.

కన్య

ఈ రాశివారికి ఊహించ‌ని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. సంయమనంతో వ్యవహరించండి. ఉద్యోగులకు ప్ర‌మోష‌న్స్, బ‌దిలీ సూచనలు ఉన్నాయి.

తుల

ఈ రాశివారికి పెద్ద‌ల స‌హ‌కారం ల‌భిస్తుంది. మొండి బ‌కాయిలు కూడా వ‌సూలు అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.

వృశ్చికం

ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొల‌గిపోయి రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు చేస్తారు. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. నూతన గృహనిర్మాణం చేపడతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగవచ్చు. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.

మకరం

ఈ రాశి వారికి పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. ఉద్యోగులు పట్టుదలతో పనులు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనుల్లో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో చిన్నపాటి అభిప్రాయభేదాలు రావచ్చు.

కుంభం

ఈ రాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలలోకి వెళ్లకుండా సంయమనంతో పనులు పూర్తిచేస్తారు.

మీనం

ఈ రాశివారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది.