Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికులు శుభవార్తలు వింటారు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కెరీర్ పరంగా, ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు గత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అవగాహనతో ఉండడం అవసరం. ఆర్థికంగా, అప్రమత్తంగా ఉండండి. భూములు, ఆస్తులు కొనుగోళ్ల విషయంలో కుటుంబ సభ్యులను సంప్రదిస్తే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు నివారించండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో కలిసి పనిచేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక భద్రత కోసం దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కొన్ని నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు రాకుండా చూసుకోండి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు, వ్యాపార అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో ఉత్సాహం కోల్పోకుండా జాగ్రత్త పడండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. బంధు వర్గం నుంచి, పితృ వర్గం నుంచి ఆకస్మిక ధనలాభాలుంటాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఇల్లు, భూమి కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రేమ సంబంధాల్లో నిజాయితితో ఉండడం అవసరం. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి జీవిత భాగస్వామితో అవగాహన, సహనంతో ముందుకు సాగాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే కుటుంబ కలహాలు ఉండవు. విద్యార్థులు చదువులో విజయం సాధించాలంటే మరింత శ్రద్ధ వహించాలి
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపుతో పాటు పదోన్నతులు కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అదుపులోనే ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక పరిపక్వతతో సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అర్థవంతమైన సమయాన్ని గడపడం మీ బంధాన్ని మరింతగా పెంచుతుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. ఒక సువర్ణావకాశం ఈ వారంలో అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే పెరుగుతున్న ఖర్చులు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చక్కని అవగాహనతో ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కెరీర్, వ్యాపార పరంగా ఆదాయాన్ని పెంచే ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందుకుంటారు. దీనితో ఆర్థికస్థితి మెరుగవుతుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి అవగాహన, సహనంతో ముందుకు సాగాలి. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. కోపావేశాలు, మాటతీరుని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆర్థిక పరంగా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు నూతన వ్యూహాలు అనుసరిస్తే లాభాలు పెరుగుతాయి. రుణసమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఎవరితోనూ వాదప్రతివాదనలకు దిగవద్దు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. రావలసిన బకాయిలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుతో ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఊహించని సమస్యలు ఏర్పడే అవకాశముంది కాబట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థికంగా స్థిరమైన ప్రగతి కోసం శ్రమించాలి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. వ్యాపారులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతుల కోసం తీవ్రంగా శ్రమించాలి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంభిస్తే మంచిది. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. రుణభారం తగ్గుతుంది. పెట్టుబడులు ఆశించిన లాభాలు అందిస్తాయి. నూతన పెట్టుబడులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. రుణభారం తగ్గవచ్చు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. కుటుంబంలో అనుకోని సమస్యలు, అనవసర వాదనలు తలెత్తవచ్చు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా అనవసర వాదనలకు దూరంగా ఉండండి. పనిప్రదేశంలో కొన్ని ఘటనలతో కలత చెందవచ్చు, భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మూడవ వ్యక్తి అపార్థాలను సృష్టించవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడులతో ప్రయోజనం ఉంటుంది. ఆదాయవృద్ధిపై దృష్టిసారిస్తే మంచిది.