Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఈ రోజంతా వివాదాలే..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చక్కని ప్రణాళికతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. కుటుంబ వేడుకల్లో బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒక సంఘటన ఆనందం కలిగిస్తుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినప్పటికీ మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు ఆస్కారం ఉంది. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలున్నా పట్టుదలతో ప్రయత్నించి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో విజయం ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో, కృత నిశ్చయంతో ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిత్రార్జితం ద్వారా లబ్ది పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. భూమి, ఆస్తి లావాదేవీలకు ఈ రోజు అనుకూలం.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు లేని మంచిరోజు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో క్లిష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. కొన్ని శుభవార్తలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారులు పెద్ద ప్రాజెక్టులపై సంతకాలు, కీలక ఒప్పందాలు చేసుకుంటారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. పనిప్రదేశంలో ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. ఈ రోజంతా వివాదాలు, ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సరదాగా, గడిచిపోతుంది. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. వృథా ఖర్చులు నివారించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వ్యతిరేక పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారయోగం ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున కొత్త ప్రాజెక్టులు, లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram