మ‌నీ ప్లాంట్‌కు ఏ దిశ అనుకూలం..? ఆ తీగ‌లు నేల‌కు తాకొచ్చా..?

Money Plant | మ‌నీ ప్లాంట్.. చాలా మంది త‌మ నివాసాల్లో, కార్యాల‌యాల్లో ఈ మొక్క‌ను పెంచుకుంటారు. ఎందుకంటే ఈ మొక్క‌తో ఆ ప్రాంతానికి అందం వ‌స్తోంది. అంతేకాదు.. ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి ఆదాయం స‌మ‌కూరుతుంద‌నేది న‌మ్మ‌కం. మ‌నీ ప్లాంట్ వేడిని గ్ర‌హించి చ‌ల్ల‌ద‌నాన్ని కూడా ఇస్తుంద‌నేది వాస్త‌వం. మ‌రి ఇంత‌టి ప్రాముఖ్య‌త ఉన్న మ‌నీ ప్లాంట్‌ను పెంచే విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఏ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను పెంచాలి..?

వాస్తు శాస్త్రం ప్ర‌కారం మ‌నీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశ‌లో పెంచుకోవాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మ‌నీ ప్లాంట్‌ను పెంచేందుకు ఆగ్నేయ దిశ అత్యంత అనుకూల‌మైన‌ది అని చెబుతున్నారు. ఎందుకంటే.. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఈ దిక్కులోనే నివసిస్తాడట. అలాగే.. ఈ దిశ శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది. అందుకే ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్​ పెంచితే.. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద పెరుగుతాయని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను పెంచ‌డం వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ కూడా పెరుగుతుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తీగ‌లు నేల‌ను తాకొచ్చా..?

అలాగే మనీ ప్లాంట్ పెంపకం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇంట్లో ఎక్క‌డ పెంచినా కూడా ఆ తీగ‌లు నేల‌కు తాకొద్ద‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ మొక్క‌ను ల‌క్ష్మీదేవి రూపంగా విశ్వ‌సిస్తారు. కాబట్టి, మనీ ప్లాంట్ తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే తీగలు పైకి, పక్కలకు వెళ్లేలా తాడు సహాయంతో కట్టాలి. ఆ పెరుగుతున్న తీగలు పెరుగుదల, శ్రేయస్సుకు చిహ్నం భావిస్తారు.