Dust Bin | ఏ దిశలో చెత్త డబ్బాను ఉంచితే మంచిది..? ఈ దిశలో పెడితే దరిద్రం తాండవిస్తుందట..!!
Dust Bin | చెత్త డబ్బా.. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఈ డస్ట్ బిన్( Dust Bin )ను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. కాబట్టి చెత్త డబ్బాను సరైన దిశ( Directions )లో పెడితేనే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) ఉంటుందట. డస్ట్ బిన్ ఉంచే విషయంలో ఈ వాస్తు నియమాలు( Vastu Tips ) పాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయి.

Dust Bin | సొంతిల్లు కట్టుకునే సమయంలో వాస్తు నియమాలు తప్పకుండా పాటిస్తాం. నిర్మించిన ఇంటిని కొనేటప్పుడు కూడా వాస్తుకు ఉందా..? లేదా..? అనే విషయాన్ని సరి చూసుకుని కొంటాం. చెప్పులు పెట్టుకునే కప్ బోర్డు నుంచి నిద్రించే పడక గది వరకు.. అన్నీ వాస్తు ప్రకారం ఉన్నాయా..? లేదా..? అనేది చెక్ చేసుకుంటారు. వీటితో పాటు ఇంట్లో నిత్యం ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా చెత్త డబ్బాను ఏ దిశలో ఉంచితే మంచిది..? ఏ దిశలో ఉంచకూడదో తెలుసుకుందాం.
తూర్పు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెత్త డబ్బాను తూర్పు దిశలో ఉంచకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నాఆరు. తూర్పు దిశలో డస్ట్ బిన్‌ను ఉంచడం వల్ల ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. ఇంట్లో వారికి ఎప్పుడూ కష్టాలు ఏరులై పారుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
పడమర
డస్ట్‌బిన్‌ను పడమర దిశలో ఉంచితే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందట. ఇక ఇంట్లో ఉండేవాళ్లకు సుఖఃసంతోషాలు లేకుండా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఉత్తరం
చెత్తబుట్టను ఉత్తర దిక్కులో పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో వాళ్ల ఉద్యోగం అవకాశాలపై ప్రభావం చూపుతుందట. అలాగే వ్యాపారంలోనూ ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
దక్షిణం
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో చెత్తడబ్బాను ఉంచితే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్లకు మానసిక సమస్యలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఆగ్నేయం
వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయంలోనూ చెత్తడబ్బాను ఉండకూడదట. దీనివల్ల ఆ ఇంట్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నైరుతి
చెత్తబుట్ట పెట్టేందుకు ఉత్తమమైన దిశగా నైరుతి దిశను సూచిస్తుంది వాస్తు శాస్త్రం. నైరుతిలో చెత్తడబ్బాను ఉంచడం వల్ల ఆ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట. ఆ ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉంటారట.
వాయవ్యం
వాస్తుశాస్త్రం ప్రకారం చెత్తడబ్బాను పెట్టుకునేందుకు మరో అనువైన దిశగా వాయవ్యాన్ని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. వాయవ్యంలో చెత్తడబ్బాను ఉంచడం వల్ల ఆ ఇంట్లో వాళ్లకు చేసే పని మీద శ్రద్ద పెరుగుతుందట. ప్రతికూల ఆలోచనలు వారి మనసుల్లోకి రావట. ఆ ఇంట్లో సుఖసంతోషాలకు కొదువ ఉండదట.
ఈశాన్యం
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధితో ముడిపడి ఉంటుందట. అలా ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వాస్తు నిపుణులు.