Yadadri | కాళీయ మర్ధనుడిగా.. శ్రీరాముడిగా నారసింహుడు.. ఘనంగా జయంతి ఉత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్నాయి

విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళశారం రెండో రోజు స్వామి వారి ఆలయంలో నిత్యారాధనలు, స్వామిఅమ్మవార్లకు లక్ష పుష్పార్చన అనంతరం జయంతి ఉత్సవాల్లో భాగంగా నారసింహుడిని కాళీయ మర్ధనుడి అవతారంలో అలంకరించి తిరువీధుల్లో విహరింపచేశారు. సాయంత్రం హనుమంత్ వాహన సేవలో శ్రీరామావతారంలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పులకించారు. ఒకవైపు వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీ..మరోవైపు నృసింహ జయంతి ఉత్సవాలతో ఆలయం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఈవో భాస్కర్‌రావు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మినరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.