విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళశారం రెండో రోజు స్వామి వారి ఆలయంలో నిత్యారాధనలు, స్వామిఅమ్మవార్లకు లక్ష పుష్పార్చన అనంతరం జయంతి ఉత్సవాల్లో భాగంగా నారసింహుడిని కాళీయ మర్ధనుడి అవతారంలో అలంకరించి తిరువీధుల్లో విహరింపచేశారు. సాయంత్రం హనుమంత్ వాహన సేవలో శ్రీరామావతారంలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పులకించారు. ఒకవైపు వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీ..మరోవైపు నృసింహ జయంతి ఉత్సవాలతో ఆలయం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఈవో భాస్కర్‌రావు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మినరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
Yadadri | కాళీయ మర్ధనుడిగా.. శ్రీరాముడిగా నారసింహుడు.. ఘనంగా జయంతి ఉత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్నాయి

Latest News
అయోధ్య విరాళాల చోరీ ఎఫెక్ట్.. చంపత్రాయ్ రాజీనామాకు ఆమోదం
బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు: కేటీఆర్
గండిపేట నెత్తిన డాటా సెంటర్ కుంపటి
కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి…ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి?
చిక్కిన మ్యాన్ ఈటర్ పెద్దపులి
పశువుల కాపరిపై సింహం దాడి…లైవ్ వీడియో
డేంజర్ ఫిష్ ఇది.. మత్స్యకారుడి వీడియో వైరల్
మాతృత్వపు వింత….కుక్క పిల్లలకు పాలు ఇచ్చిన పంది !
మొసలిని మింగేసిన కొండ చిలువ..వీడియో వైరల్