CCMB | సీసీఎంబీలో ఒప్పంద ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

CCMB | మీరు పోస్టు గ్రాడ్యుయేష‌న్( Post Graduation ) పూర్తి చేసి ఉండి, ప‌రిశోధ‌న( Research ) చేయాల‌నే ఆస‌క్తి ఉంటే.. సీసీఎంబీ( CCMB ) గొప్ప అవ‌కాశాన్ని క‌లిగిస్తుంది. రీసెర్చ్ సైంటిస్ట్( Research Scientist ), ప్రాజెక్టు అసోసియేట్( Project Associate ) వంటి ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.

CCMB | సీసీఎంబీలో ఒప్పంద ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

CCMB | హైద‌రాబాద్ హ‌బ్సిగూడ‌లోని సీఎస్ఐఆర్ – సెంట‌ర్ ఫ‌ర్ సెల్యుల‌ర్ అండ్ మాలిక్యుల‌ర్ బ‌యాల‌జీ( CCMB ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 3 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతుంది.

ప్రాజెక్టు రిసెర్చ్ సైంటిస్ట్ – 2 (నాన్ మెడిక‌ల్ ) : 01
సీనియ‌ర్ ప్రాజెక్టు అసోసియేట్ : 01
ప్రాజెక్టు అసోసియేట్ – 1 : 01

అర్హ‌త

పోస్టును అనుస‌రించి పీజీతో పాటు ప‌ని అనుభ‌వం ఉండాలి. గ‌రిష్ఠ వ‌య‌సు ప్రాజెక్టు రిసెర్చ్, సీనియ‌ర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏండ్లు, ప్రాజెక్టు అసోసియేట్‌1కు 35 ఏండ్లకు మించ‌కూడదు.

వేతనం

నెల‌కు ప్రాజెక్టు రిసెర్చ్ సైంటిస్ట్-2(నాన్ మెడిక‌ల్‌)కు రూ. 67 వేలు, సీనియ‌ర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ. 42 వేలు, ప్రాజెక్టు అసోసియేట్‌-1కు రూ. 25 వేలు.

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ : జులై 14
ఎంపిక : ఇంట‌ర్వ్యూ

వెబ్‌సైట్ : https://www.ccmb.res.in/