Eklavya Model Residential Schools | ‘ఏకలవ్య’లో 7267 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే..!
Eklavya Model Residential Schools | మీరు ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) కోసం ఎదురు చూస్తున్నారా..? అది కూడా టీచర్( Teacher )గా స్థిరపడాలనుకుంటున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్( Job Notification ) మీకు సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్స్( Eklavya Model Residential Schools )లో 7267 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Eklavya Model Residential Schools | మీరు డిగ్రీ, బీఈడీ( BEd ), పీజీ, నర్సింగ్( Nursing ), డిప్లొమా వంటి కోర్సులు పాసై ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే మీకు ఇది శుభవార్తే. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్( Eklavya Model Residential Schools )లో టీచింగ్, నాన్ టీచింగ్‌కు సంబంధించి 7267 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా ….
మొత్తం ఖాళీలు: 7267
పోస్టుల వారీగా ఖాళీలు:
ప్రిన్సిపల్- 255
పీజీటీ – 1460
టీజీటీ – 3962
స్టాఫ్ నర్స్ (ఫీమేల్)-550
హాస్టల్ వార్డెన్ -635
అకౌంటెంట్- 61
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్) – 228
ల్యాబ్ అటెండెంట్- 146
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, పీజీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణత
నోట్: వయస్సు ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు
ఎంపిక విధానం:
– ఆయా పోస్టులకు వేర్వేరు పద్ధతిలో ఎంపిక చేస్తారు
టీజీటీ ఎంపిక విధానం
– జనరల్ అవేర్‌నెస్ – 100, రీజనింగ్ ఎబిలిటీ-15, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ -15, టీచింగ్ ఆప్టిట్యూడ్-30, డొమైన్ నాలెడ్జ్-30 మార్కులకు ఉంటుంది
మొత్తం 100 మార్కులు – 100 ప్రశ్నలు.
– పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
నోట్- రీజినల్ లాంగ్వేజ్ పోస్టులకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. అయితే ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్ట్ మాత్రమే
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 23
వెబ్‌సైట్: https://nests.tribal.gov.in