CPGET – 2025 | ‘సీపీగెట్’ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి ఇలా..
CPGET - 2025 | మీరు డిగ్రీ( Degree ) పాసయ్యారా..? పీజీ కోర్సులు( PG Courses ) చేయాలనుకుంటున్నారా..? అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) లాంటి యూనివర్సిటీల్లోనా..? అయితే ఆలస్యమెందుకు.. సీపీగెట్ - 2025( CPGET - 2025 ) నోటిఫికేషన్ విడుదలైంది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి ఇలా..

CPGET – 2025 | మీరు డిగ్రీ( Degree ) పాసయ్యారా..? ఇక ఆయా యూనివర్సిటీల క్యాంపస్‌లలో( University Campus ) చదువాలనుకుంటున్నారా..? మీకు నచ్చిన కాలేజీలో పీజీ( PG Courses ) చేయాలనుకుంటున్నారా..? మరి ఆలస్యమెందుకు.. రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పలు రకాల పీజీ కోర్సులు( PG Courses ), ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో( Integrated Courses ) ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) నిర్వహించే సీపీగెట్ – 2025( CPGET -2025 ) నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షా విధానం, కోర్సులు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీల వివరాలు తెలుసుకుందాం.
సీపీగెట్ ఆఫర్ చేస్తున్న కోర్సులు
ఎంఏ (ఇంగ్లీష్, అరబిక్, హిందీ, కన్నడ, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్), ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్) ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంకాం, ఎంఈడీ, ఎమ్మెస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, ఎలక్టానిక్స్, జియాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్), పీజీడీ ఇన్ సెరికల్చర్, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్,ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెల్సీ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ తదితరాలు.
ఎవరు అర్హులు ?
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు లేదా డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులు లేదా సెకండియర్ పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ఎలా ?
ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. సబ్జెక్టులను బట్టి సిలబస్ మారుతుంది.
ఫీజు వివరాలు : ఓసీ, బీసీలకు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 600. ప్రతి అడిషనల్ సబ్జెక్ట్‌కు రూ. 450 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ : జులై 17, ఆలస్య రుసుం రూ.500తో జూలై 24 వరకు, రూ. 2000తో జులై 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు : ఆగస్టు మొదటి వారంలో
ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు
ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్
కాకతీయ యూనివర్సిటీ – వరంగల్
తెలంగాణ యూనివర్సిటీ – నిజామాబాద్
మహాత్మాగాంధీ యూనివర్సిటీ -నల్లగొండ
పాలమూరు యూనివర్సిటీ -మహబూబ్‌నగర్
శాతవాహన యూనివర్సిటీ -కరీంనగర్
జేఎన్‌టీయూ -హైదరాబాద్
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం – కోఠి, హైదరాబాద్
ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం ఇలా..
మొదటగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. ఇందుకు డిగ్రీ, ఇంటర్, టెన్త్ క్లాస్ వివరాలు నమోదు చేయాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ తప్పనిసరి. ఎన్ని సబ్జెక్టులు రాస్తున్నామో కూడా ఇక్కడే నమోదు చేయాల్సి ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపాలి. ఇక్కడ పది, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమో, ఫొటో, సంతకం, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఫొటో కాపీలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ దగ్గరగా పెట్టుకుని దరఖాస్తు నింపితే బెటర్.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.. cpget.tsche.ac.in/CPGET_HomePage.aspx