IBPS Clerk | ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6,128 ఉద్యోగాలు.. IBPS క్లర్క్‌ నోటిఫికేషన్‌ విడుదల

IBPS Clerk | ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-2026 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ పోస్టుల భర్తీకి 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)' దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా 105, 104 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

  • Publish Date - July 1, 2024 / 12:00 PM IST

IBPS Clerk : ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-2026 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ పోస్టుల భర్తీకి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)’ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా 105, 104 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.

ఖాళీల వివరాలు

అండమాన్ నికోబార్ 01, ఆంధ్రప్రదేశ్ 105, అరుణాచల్ ప్రదేశ్ 10, అస్సాం 75, బీహార్ 237, చండీగఢ్ 39, ఛత్తీస్ గఢ్ 119, దాద్రానగర్ హవేలీ 05, ఢిల్లీ 268, గోవా 35, గుజరాత్ 236, హర్యానా 190, హిమాచల్ ప్రదేశ్ 67, జమ్మూకశ్మీర్ 20, జార్ఖండ్ 70, కర్ణాటక 457, కేరళ 106, లడఖ్ 03, మధ్యప్రదేశ్ 354, మహారాష్ట్ర 590, మణిపూర్ 06, మేఘాలయ 03, మిజోరం 03, నాగాలాండ్ 06, ఒడిశా 107, పుదుచ్చేరి 08, పంజాబ్ 404, రాజస్థాన్ 205, సిక్కిం 05, తమిళనాడు 665, తెలంగాణ 104, త్రిపుర 19, ఉత్తరప్రదేశ్ 1,246, ఉత్తరాఖండ్ 29, వెస్ట్ బెంగాల్ 331 ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి

అభ్యర్థులు 01.07.2024 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1996 నుంచి 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 3 నుంచి 8 సంవత్సరాలు, వితంతువులు, ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీల వారీగా 3 నుంచి 4 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన వారికి 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు : రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం : ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష : మొత్తం 100 మార్కులకు ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు – 30 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు – 35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు – 35 మార్కులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున గంట వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థి ప్రతి విభాగంలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ స్కోర్ దాటిన అభ్యర్థులను మాత్రమే ఖాళీలకు అనుగుణంగా షార్ట్‌ లిస్ట్‌ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.

మెయిన్ పరీక్ష : మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు – 50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు – 40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు – 60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు – 50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు – 200 మార్కులకు 160 నిమిషాలు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

ముఖ్య తేదీలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.07.2024

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది : 21.07.2024

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ : 12.08.2024 – 17.08.2024

ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ : ఆగస్టు, 2024

ప్రిలిమినరీ పరీక్ష తేదీలు (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం) : ఆగస్టు, 2024

ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి : సెప్టెంబర్‌ 2024

మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ : సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2024

మెయిన్ పరీక్ష తేదీ (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం) : అక్టోబర్‌, 2024

ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌ : ఏప్రిల్, 2025

Latest News