Govt jobs | నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు.. నెలకు రూ.89 వేల వేతనం.. వెంటనే దరఖాస్తు చేయండి

Govt jobs | ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ఎదురు చూస్తున్నారా..? ప్రభుత్వ కొలువు సాధించడమే మీ లక్ష్యమా..? అయితే మీకు గుడ్ న్యూస్..! కేంద్ర ప్రభుత్వ సంస్థ 'నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (NABARD)' పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Govt jobs | నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు.. నెలకు రూ.89 వేల వేతనం.. వెంటనే దరఖాస్తు చేయండి

Govt jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ఎదురు చూస్తున్నారా..? ప్రభుత్వ కొలువు సాధించడమే మీ లక్ష్యమా..? అయితే మీకు గుడ్ న్యూస్..! కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (NABARD)’ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు డిగ్రీ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థాయిని బట్టి కొన్ని ఉద్యోగాలకు డిప్లొమా, పీజీ అవసరం. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.89 వేల వరకు వేతనం పొందొచ్చు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నాబార్డ్‌ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నాబార్డ్ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 15 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరి ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకో మెట్రిక్ టెస్ట్, ఇంటర్య్వూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి.