NEET Adimit cards | నీట్ అడ్మిట్ కార్డులు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
NEET Adimit cards | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్ యూజీ-2024 (NEET UG-2024)' పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 5న జరగనున్న ఈ పరీక్షకు ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. తాజాగా అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
NEET Adimit cards : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ-2024 (NEET UG-2024)’ పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 5న జరగనున్న ఈ పరీక్షకు ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. తాజాగా అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
నీట్ పరీక్షకు ఈసారి 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దేశంలోని 557 కేంద్రాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థులు అప్లికేషన్ నెంంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి తమ హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా 011-40759000 నెంబర్‌లో లేదా neet@nta.ac.in లో ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram