SSC Posts Recruitment | కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఫేజ్ -14/2026 సెలక్షన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిప్రకారం దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని మొత్తం 3003 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏప్రిల్ 13వ తేదీన ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. మే 4వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన అభ్యర్తులు SSC అధికారిక వెబ్‌సైట్ లేదా mySSC మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఈ నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో జరిగే ఈ పరీక్షలో ఒక్కో తప్పునకు 0.50 నెగెటివ్ మార్కులు కలవు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవసరమైతే స్కిల్ టెస్క్ కూడా నిర్వహిస్తారు.
అర్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా ఉంది. ఈ వయసు 01.01.2026 నాటికి వర్తిస్తుంది. ఇక పోస్టుల వారీగా విద్యార్హతలు మారుతాయి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము – రిజర్వేషన్లు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మొత్తం 3003 పోస్టుల్లో జనరల్ కేటగిరీలో 1534 పోస్టులు, ఓబీసీలో 667 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కు 271 పోస్టులు, ఎస్సీలకు 346 పోస్టులు, ఎస్టీలకు 185 పోస్టులు కేటాయించారు.
అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి నిమిషంలో టెక్నికల్ సమస్యలు ఎదురైతే అనవసరంగా ఛాన్స్ మిస్సవుతారని హెచ్చరించారు. దరఖాస్తు సమయంలో ఫొటో, సంతకం, ఇతరత్రా వివరాలు సరిచూసుకోవాలని చెబుతున్నారు.
Read More;
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్‌లో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేశాడు..
