• Telugu News
  • /Trending

850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్‌లో మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కొట్టేశాడు.. 

కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. వీర్‌ కఠారియా. 850కి పైగా కంపెనీలకు దరఖాస్తులు చేసుకున్న కఠారియా.. 13 ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఆఖరుకు ఐర్లాండ్‌లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తన విజయగాథను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

Reported by: Jagan Mohan Talluri | ట్రెండింగ్ | Apr 14, 2026, 8:52 pm IST
Read Time: 5 mins
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్‌లో మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కొట్టేశాడు.. 

హైలైట్స్:

  • ఏడాదిన్నర పాటు ఆన్‌లైన్‌కు దూరం
  • సోషల్ మీడియా వాస్తవం కాదు… అంతా అబద్ధాలే
  • తన విజయగాథను పంచుకున్న ధీర్‌  కఠారియా

ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సంపాదించడం ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన యువత కల. ఆ కలను నిజం చేసుకోవడానికి సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది. అనేక తిరస్కారాల తరువాత ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదు. కానీ ఇండియాకు చెందిన టెక్ ప్రొఫెషనల్ దాన్ని సాధించాడు. ఎన్నో అవాంతరాలు, అవమానాలు జీవితంలో ఎదురైనప్పటికీ అంకితభావంతో ప్రయత్నించడం మూలంగా లక్ష్యం చేరుకున్నాడు. ఆయనే ధీర్ కఠారియా. చివరకు ఐర్లాండ్‌లోని మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం దక్కించుకున్నాడు. తనకు ఎదురైన అనుభవాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు పలువురికి స్ఫూర్తిని ఇస్తోంది.

తన 18 నెలల ఉద్యోగ వేటలో 850 సార్లు దరఖాస్తు సమర్పించగా, కష్టపడే మనస్తత్వం మూలంగా లక్ష్యం చేరుకున్నట్లు ధీర్ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలలో ఉద్యోగం కోసం 850కి పైగా దరఖాస్తులు చేసుకోగా, 13 సంస్థలు ఇంటర్వ్యూకు పిలిచాయని తన పోస్టులో రాసుకొచ్చారు. చివరకు ఏప్రిల్ 1వ తేదీన మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరానని తెలిపారు. దరఖాస్తులు చేసినా ఇంటర్వ్యూలకు పిలవకపోవడం, కొలువు దక్కకపోవడం మూలంగా నిద్రలేని రాత్రులు గడిపానని, తీవ్ర ఒత్తిడికి గురయ్యానని పేర్కొన్నారు. దీనికి తోడు విదేశాలలో వీసా సమస్యలు తలెత్తడం తనకు శాపంగా పరిణమించిందన్నారు.

ధీర్ విజయం సోషల్ మీడియాలో వందలాది హృద‌యాల‌ను గెలుచుకున్నది. ఆయన ఒక కంటెంట్ క్రియేటర్ అయినప్పటికీ ఏడాదిన్నర నుంచి కనిపించకుండా లోలోన కుమిలిపోయాడు. ‘గత ఏడాదిన్నరగా ఎందుకు కన్పించకుండా పోయాను? ఆన్‌లైన్‌లో కంటెంట్ చేయడం ఎందుకు ఆపేశాను? అని ఆశ్చర్యపోయే వారికి నేను చెప్పేది ఒకటే. వాస్తవానికి ఒక రూపం ఉంటుంది, దాన్ని ఆన్ లో ఆన్ లైన్ ఎవరు చెప్పరు. సోషల్ మీడియా అనేది వాస్తవం కాదు, ప్రతి ఒక్కరు అబద్దాలు చెబుతారు. ఈ కారణాలతోనే నేను సోషల్ మీడియా నుంచి ఏడాదిన్నరగా దూరంగా ఉన్నాను’ అని తెలిపారు. అయినప్పటికీ తమ జీవిత ప్రయాణంలో ముందుకు సాగే వారికి శుభాకాంక్షలు చెప్పారు.

జీవితంలో తాము పడే కష్టాలను ఇతరులు చూడకపోయానా, తను వాటిని ప్రత్యక్షంగా చూస్తున్నానని సోషల్ మీడియాలో అనుసరిస్తున్న వారికి వెల్లడించారు. జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే, ఏ ఒక్కరు కూడా ఆశ వదులుకోకూడదని రాసుకొచ్చారు. ధీర్ తన కథనం రాస్తున్న సమయానికి 1.2వేల కన్నా ఎక్కువ లైక్ లు, 26 మంది స్పందించడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Deergh Kataria (@deerghkataria)