తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు TGBIE అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నంబర్‌తో ఫలితాలు చూసుకోవచ్చు.

Reported by: Tejaswini Nanna | విద్య - ఉద్యోగం | Jun 11, 2026, 1:31 pm IST
Read Time: 2 mins
తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 13 నుంచి 21 వరకు జరిగాయి. సుమారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 3,98,358 మంది హాజరయ్యారు. ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను గురువారం ఇంటర్మీడియట్ బోర్డు ఆన్‌లైన్‌ ద్వారా రిలీజ్‌ చేసింది.

ఫలితాల కోసం..TGBIE అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ను సందర్శించండి. హోమ్‌పేజీలో, ‘TG Inter 1st/ 2nd year supply result 2026’ పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
సబ్మిట్ చేయగానే, మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనిని ప్రింట్‌ తీసుకోవచ్చు.