తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిసెట్) 2026 కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్య మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. నామాల లోకేశ్ (వరంగల్) ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. బోనోతు హేమనాథ్ (సూర్యాపేట) రెండో ర్యాంక్ సాధించాడు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను, ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 27 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ : రాష్ట్రంలో వచ్చే అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి (2026-27) ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లకు ఈ నెల 27వ తేదీన కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అడ్మిషన్ల కమిటీ సమావేశం ఇటీవలే నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు విడతల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను జూన్ 6వ తేదీన కేటాయిస్తారు. అదే నెల 9వ తేదీన పాలిటెక్నిక్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది. చివరి విడత కౌన్సెలింగ్ జూన్ 6వ తేదీన కేటాయిస్తారు.
తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ : ఈ నెల 27-31వ తేదీ వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, 29వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 6న సీట్ అలాట్మెంట్, 6వ తేదీ నుంచి 9 వరకు ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 8, 9 తేదీల్లో సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్, 9న విద్యా సంవత్సరం ప్రారంభం.
చివరి విడత కౌన్సెలింగ్ జూన్ 15వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. జూన్ 27వ తేదీ నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహిస్తారు. అంటే అప్పటికే సీటు పొందిన కాలేజీల్లో ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారొచ్చు. స్పాట్ అడ్మిషన్లను జులై 1 నుంచి 8 తేదీల మధ్య పూర్తిచేసుకోవాలని అధికారులు నిర్దేశించారు.
ఇవి కూడా చదవండి :
చైనా బొగ్గు గనిలో పేలుడు…82మంది దుర్మరణం
సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త హత్య!
