TG SSC Supplementary Results | మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
TG SSC Supplementary Results | తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు (TG SSC Advanced Supplementary Results) మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీవరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
TG SSC Supplementary Results : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు (TG SSC Advanced Supplementary Results) మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీవరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
కాగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను https://bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు మొదట వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో కనిపించే TG Advanced SSC Supplementary Results 2024 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ బటన్ నొక్కితే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 89.42 శాతం, బాలికల్లో 93.23 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత బాలురకంటే 3.81శాతం అధికంగా ఉంది. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram