తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15–30 దరఖాస్తులు, జూన్ 15–30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూలైలో ఫలితాలు ప్రకటిస్తారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) షెడ్యూల్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 15 నుంచి 30 వరకు గడువు ఉంది. ఒక ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 పరీక్షా ఫీజు స్వీకరించనున్నారు. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ కల్పించనున్నారు.
ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి తొలివిడత పరీక్షకు పచ్చజెండా ఊపింది. విద్యాశాఖ అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపగా, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అనుమతి ఇచ్చారు. దాంతో నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ ద్వారా టీజీ టెట్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లింపులు స్వీకరించబడతాయి. జూన్ మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జూలైలో ఫలితాలు ప్రకటించనున్నారు.
పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ప్రాథమిక పాఠశాల (క్లాస్ 1–5) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. పేపర్–2లో ఉన్నత ప్రాథమిక పాఠశాల (క్లాస్ 6–8) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఒకే పేపర్ లేదంటే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: పేపర్–1కు దరఖాస్తు చేసుకోవాలంటే D.EI.Ed లేదా B.Ed (ప్రాథమిక) అర్హత ఉండాలి. పేపర్–2కు B.Ed లేదా సంబంధిత విద్యా అర్హత అవసరం. కనీసం 50% మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఇవి కూడా చదవండి :
పాదయాత్రలో కేటీఆర్ వాస్తవాలు చెప్పాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram