Overseas Jobs | ట్రక్కు డ్రైవింగ్ వస్తే.. జర్మనీలో 3.7 లక్షల జీతం.. టామ్‌కామ్ ద్వారా నోటిఫికేషన్ విడుదల.. రేపే ఇంటర్వ్యూలు!

Overseas Jobs | జర్మనీలో భారీ ఉద్యోగావకాశాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్(TOMCOM) ద్వారా ట్రక్కు డ్రైవర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ..2.6లక్షల నుంచి 3.7 లక్షల వరకు జీతం అందించనున్నారు.

Overseas Jobs | జర్మనీలో భారీ ఉద్యోగావకాశాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్(TOMCOM) ద్వారా ట్రక్కు డ్రైవర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ..2.6లక్షల నుంచి 3.7 లక్షల వరకు జీతం అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం (ఏప్రిల్ 20వ తేదీన) ఇంటర్వ్యూలకు హాజరుకావాలని టామ్‌కామ్ అధికారులు సూచించారు.

అర్హతలు

– 10 లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
– వయస్సు 40 ఏళ్లకు మించరాదు
– హెవీ ట్రక్కు డ్రైవింగ్‌లో రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి

వసతులు

– ఎంపికైన వారికి ఉచిత వీసా, విమాన టికెట్లు అందజేస్తారు.
– వారానికి ఐదు రోజుల పని.. రోజుకు 8-9 గంటల డ్యూటీ ఉంటుంది.

ఇంటర్వ్యూ వివరాలు

అభ్యర్థుల ఎంపిక కోసం ఏప్రిల్ 20 ( సోమవారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో ఉన్న టామ్‌కామ్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు పై ఫొటోలని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేయవచ్చు. లేదంటే tomcom.resume@gmail.com మెయిల్ అడ్రస్‌కు రెస్యుమ్‌లను పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం 9440051285, 944051452 నంబర్లలో సంప్రదించవచ్చు.

Read More:

డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్!

ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ.1.21లక్షల ట్యాక్స్ ఫ్రీ జీతం.. రవాణా, వసతి కూడా ఫ్రీ!

Latest News