TS PECET | బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం PECET నోటిఫికేషన్‌ విడుదల

TS PECET | ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కోర్సులలో ప్రవేశాల కోసం 'ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (PECET)-2024' నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ/ప్రైవేట్‌/అనుబంధ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

TS PECET | బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం PECET నోటిఫికేషన్‌ విడుదల

TS PECET : ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కోర్సులలో ప్రవేశాల కోసం ‘ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (PECET)-2024’ నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ/ప్రైవేట్‌/అనుబంధ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. శాతవాహన యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

బీపీఈడీ కోర్సుకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 2024 జూలై 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.

డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు 2024 జూలై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌

దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్‌ ద షాట్, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/హైజంప్‌.. మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్‌ ద షాట్, 400 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌/హైజంప్‌ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు.

స్కిల్‌ టెస్ట్‌

బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నిస్, వాలీబాల్‌ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు : ఆన్‌లైన్‌ ద్వారా
చివరి తేదీ : మే 15 2024
హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ : మే 26 నుంచి
వెబ్‌సైట్‌ : https://pgecet.tsche.ac.in