Samantha | విడాకులు నా వ్యక్తిగత విషయం.. దయచేసి చిన్నచూపు చూడకండి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన
Samantha | రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) వ్యాఖ్యలపై నటి సమంత( Samantha ) స్పందించారు. కేటీఆర్( KTR )తో తనకు సంబంధాన్ని అంటగట్టిన సురేఖకు ఎక్స్ వేదికగా సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Samantha | తన వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ( Konda Surekha )పై నటి సమంత( Samantha ) ఫైర్ అయ్యారు. తన విడాకులు( Divorce ) అనేది తన వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని సమంత సూచించారు.
స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉంటుందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని సమంత పేర్కొన్నారు.
నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను అని సమంత స్పష్టం చేశారు.
కొండా సురేఖ కామెంట్స్ పై సినీ నటి సమంత వివరణ pic.twitter.com/03M5KLzMkX
— Devi Prasad Rao (@deviprasadBrs) October 2, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram