Anasuya| మళ్లీ గెలికిన అనసూయ.. మీ హీరో మాదిరిగా మీకు ఆడవాళ్లని తిట్టడం మాత్రమే వచ్చు!
Anasuya| న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత చిన్నా చితకా షోలు చేసుకుంటూ జబర్ధస్త్‌లోకి అడుగుపెట్టింది. దాంతో ఈ అమ్మడి రాత
Anasuya| న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత చిన్నా చితకా షోలు చేసుకుంటూ జబర్ధస్త్‌లోకి అడుగుపెట్టింది. దాంతో ఈ అమ్మడి రాత మారింది. జబర్ధస్త్ షోకి గ్లామర్ అద్దిన ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది. ఈ షోలో అనసూయ వేసే జోకులు, సమయస్పూర్తితో మంచి యాంకర్‌గా గుర్తింపు దక్కింది.ఇక జబర్ధస్త్ చేసే సమయంలో అనసూయకి సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె సినీ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే యాంకరింగ్ వదిలేసి నటిగా సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది అనసూయ.

అనసూయ కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆయన ఫ్యాన్స్‌ని టార్గెట్ చేసింది. గతంలో అనసూయకి, హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరగడం మనం చూశాం. ఆ సమయంలో అనసూయ పోలీస్ కేసు కూడా పెట్టింది. అయిన వారు శాంతించలేదు. చేసేదేం లేక అనసూయనే కాస్త తగ్గింది. అయితే అనసూయ ప్రస్తుతం సింబా అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీ ట్రైలర్‌లో అక్కా నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడని ఓ వ్యక్తి అనసూయతో అంటాడు. దీంతో ఆమె ముఖంలో నవ్వులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు .. మీకు, విజయ్ దేవరకొండకి గొడవలు ముగిసినట్టేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అడగ్గా అనసూయ.. నాకు ఏం గొడవలు లేవు.
ఒక ఫేమ్ లో ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు అలా మాట్లాడితే మీరు కూడా సైలెంట్ గానే ఉన్నారు. మీకు తప్పనిపించలేదు. ఇవి అతన్ని అడగరు. నన్నే అడుగుతారు. నేను ఆయనలాగా ఆమెను అడగండి అని అగౌరవంగా మాట్లాడను. ఒక సంఘటనలో తప్పు జరిగితే నేను ప్రశ్నించాను అంతే అని చెప్పింది. ఇక అనసూయ కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్లీ అనసూయని టార్గెట్ చేశారు. ట్రోలింగ్ చేస్తుండడంతో అనసూయ.. ఓ ట్వీట్ వేసింది. మరీ ఇంత చాతకాని వాళ్ళ లాగా ఉంటే ఎలాగండి. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు. అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే. కానీ మీరు అలా చెయ్యరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరో లాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. నేను ఇప్పటికి మీ అందరి గురించి ప్రార్థిస్తాను మీరు మంచి పని చేసుకోవాలని అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram