‘దంగల్’ వసూళ్లు 2వేల కోట్లు – మాకు దక్కింది కేవలం…. : బబితా ఫొగట్
Babita Phogat । దంగల్… ఈ హిందీ సినిమా గురించి తెలియనివారెవరూ ఉండరు. భారత మల్లయోధురాళ్లు గీతా ఫొగట్, బబితా ఫొగట్‌తో పాటు వారి తండ్రి మహావీర్ ఫొగట్ జీవన గమనంపై తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడి బబితా ఫొగట్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఎవరి జీవిత గాథ ఆధారంగా దంగల్(Dangal) సినిమా తీసారో, ఆ భారత మాజీ మల్లయోధురాలు బబితా ఫొగట్(Babita Phogat), ఆ సినిమా గురించి ఒక సంచలన విషయం వెల్లడించింది(Revelation). మల్లయుద్ధ రంగం నుండి తప్పుకున్న బబిత ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. తమ జీవిత చరిత్ర(Bio pic) ఆధారంగా తీసిన హిందీ చిత్రం ‘దంగల్’కు సంబంధించిన కొన్ని ఆర్థిక వివరాలు వెల్లడించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆమిర్‌ఖాన్(Aamir Khan) ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం దేశంలో, దేశం వెలుపలా సంచలన విజయం(Blistering Hit) సాధించి, ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2వేల కోట్ల(2000 Crores) వసూళ్లు సాధించిందని సినిమా వ్యాపారవర్గాలు చాలాసార్లు తెలిపాయి. కాకపోతే, నిర్మాతల నుండి తమ కుటుంబానికి దక్కింది కేవలం ఒక కోటి రూపాయలు(1 Crore only) మాత్రమేనని బబితా ఫొగట్ వెల్లడించింది.

“దంగల్ వసూలు చేసిన రెండు వేల కోట్ల నుండి ఫొగట్ కుటుంబానికి దక్కింది కేవలం ఒక కోటి రూపాయలేనా?” అని ఇంటర్వ్యూలో భాగంగా న్యూస్24(News 24) చానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బబితా ఫొగట్ ఖరాఖండిగా చెప్పిన సమాధానం “అవును”.
‘దంగల్ రెండువేల కోట్లు సంపాదించిన తర్వాత కూడా కోటి రూపాయల నామమాత్రపు మొత్తం దక్కినందుకు తను గానీ, తన కుటుంబం గానీ నిరాశ చెందారా?’ అన్న ప్రశ్నకు, ప్రేమ – గౌరవం సంపాదించుకోవడం మాత్రమే తమ ఉద్దేశ్యమని, డబ్బు కాదని స్పష్టం చేసింది. “లేదు. నాన్నగారు ఒక విషయం చెప్పారు. మనకు ప్రజల నుండి ప్రేమ, గౌరవం చాలు అని”. 2016లో విడుదలైన దంగల్ చిత్ర కథ.. బబితా ఫొగట్, తన అక్క గీతా ఫొగట్(Geeta Phogat) ఇంకా తండ్రి మహావీర్ ఫొగట్ జీవిత గాథ ఆధారంగా తీసింది. మహావీర్ ఫొగట్(Mahavir Phogat) తన కూతుళ్లైన గీత, బబితలను మల్లయోధులుగా దేశం గర్వించే స్థాయికి ఎలా తీర్చిదిద్దాడనేదే స్థూలంగా కథాస్వరూపం. బబిత 2010 కామన్వెల్త్ క్రీడ(2010 CWG)లలో రజత పతకం సంపాదించింది. ఆ తర్వాత 2012లో ప్రపంచ మల్లయుద్ధ చాంపియన్‌షిప్(WWC)లో కాంస్యపతకంతో సరిపెట్టుకున్నా, 2014లో మళ్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం(Gold Medal) గెలుచుకుని భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. 2019లో క్రీడల నుండి తప్పుకుని రాజకీయాలలోకి ప్రవేశించింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram